దక్షిణాఫ్రికా పర్యటనకు చేరుకున్న టీమిండియా ఒక్క రోజు క్వారంటైన్ పూర్తి చేసుకుని ప్రాక్టీస్ మొదలు పెట్టింది. జోహన్నెస్‌బర్గ్‌లో ఫుట్‌వాలీ మ్యాచ్‌తో వారి తొలి ప్రాక్టీస్ సెషన్‌ను మొదలుపెట్టారు. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్‌తో పాటు సహచర ఆటగాళ్లు రెండు జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు అశ్విన్ సారథ్యం వహించగా, మరో జట్టుకు ద్రవిడ్ నాయకత్వం వహించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది.
ఈ వీడియోలో అశ్విన్, పుజారా సీరియస్‌గా ఏదో గొడవపడినట్లు కనిపిస్తుంది. అదే విధంగా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఫుట్‌బాల్ స్కిల్స్‌ను చూసి కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశ్చర్యపడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఇక సెంచూరియాన్ వేదికగా డిసెంబర్26న భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది.
భారత టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, హనుమ విహారి, రిషబ్ పంత్(వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్
చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు అతడిని కచ్చితంగా తీసుకోవాలి..
How did #TeamIndia recharge their batteries ahead of their first training session in Jo'Burg? 🤔
— BCCI (@BCCI) December 18, 2021
On your marks, get set & Footvolley! ☺️😎👏👌#SAvIND pic.twitter.com/dIyn8y1wtz
Comments
Please login to add a commentAdd a comment