
మాంచెస్టర్ : ప్రపంచ కప్ ఆతిథ్య దేశం ఇంగ్లండ్‌ను తోసిరాజంటూ వన్డేల్లో టీమిండియా టాప్ ర్యాంక్‌కు చేరింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన జాబితా ప్రకారం 123 పాయింట్లతో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు టాపర్‌గా ఉన్న ఇంగ్లండ్ 122 పాయింట్లతో రెండో స్థానానికి పడి పోయింది. న్యూజిలాండ్ (114), ఆస్ట్రేలియా (112) వరుసగా తర్వాతి ర్యాంకుల్లో ఉన్నాయి. గురువారం వెస్టిండీస్‌పై నెగ్గిన భారత్ ఈ నెల 30న ఇంగ్లండ్‌పైనా గెలిస్తే 124 పాయింట్లతో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంటుంది. అప్పుడు ఇంగ్లండ్ 121 పాయింట్లకు పరిమితం అవుతుంది. ఆ జట్టు నెగ్గితే 123 పాయింట్లతో నంబర్ వన్ ర్యాంకును తిరిగి కైవసం చేసుకుంటుంది. ఒకవేళ విండీస్‌పై ఓడి, ఇంగ్లండ్‌పై గెలిచినా 122 పాయింట్లతో భారత్ అగ్రస్థానానికి ఢోకా ఉండకపోయేది. రెండింటిలోనూ ఓడితే మాత్రం పాయింట్లు 120కి పడిపోడిపోయేవి.
Comments
Please login to add a commentAdd a comment