బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన స్క్రీన్‌పై యాక్షన్ హీరో అయినా ఆఫ్ స్క్రీన్‌పై మాత్రం ఓ మంచి తండ్రిగా కుటుంబంతో గడిపేందుకే ప్రాధాన్యత ఇస్తాడు. తన తల్లిదండ్రులు ఎలాంటి విలువలు నేర్పారో అవే తన పిల్లలకు నేర్పించానని సగర్వంగా చెబుతుంటాడు. ఇక్కడ అక్షయ్ దంపతుల నుంచి ప్రతి తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన కీలక విషయాలేంటో సవివరంగా చూద్దాం..!.
చెఫ్‌గా మొదలైన అక్షయ్ కుమార్ ఇప్పుడు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ స్టార్‌లో ఒకడిగా చెలామణి అవుతున్నాడు. ఆయన ఎన్నో వెవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే బుల్లితెరపై యాంకర్‌గా ఫియర్ ఫ్యాక్టర్ సిరీస్‌తో అలరించాడు కూడా. అలాంటి ఆయన ఓ ఫ్యామిలీ మ్యాన్‌గా ఎంతలా ఉంటాడో చాలామందికి తెలియదు.
ఆఫ్ స్క్రీన్‌పై తన భార్య ట్వింకిల్ ఖన్నా, ఇద్దరు పిల్లలతో టైం స్పెండ్ చేసేందుకే ఇష్టపడతాడు. ఆయనకు మొదటి సంతానంగా 21 ఏళ్ల ఆరవ్, రెండో సంతానంగా 11 ఏళ్ల నితారా అనే కుమార్తె ఉంది. ఆయన ఓ తండ్రిగా, భర్తగా ఏం చేయాలో అవన్నీ పుల్‌ఫిల్ చేస్తుంటాడు. అతడి పేరెంటింగ్ నుంచి నేర్చుకోవాల్సినవి ఇవే..
సమాయన్ని కేటాయించడం..
నటుడిగా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా పిల్లల కోసం సమయం కేటాయిస్తాడు. వాళ్లతో కలిసి వాకింగ్ లేదా పార్కులో గడుపుతాడు. పిల్లలు కూడా ఫిట్‌నెస్‌తో ఉండేలా కేర్ తీసుకుంటాడు. కాస్త విరామం దొరికిన పిల్లలతో గడిపేందుకు ప్రాధాన్యత ఇస్తాడు.
కలిసి చదవడం..
తన కూతురు నితారా చిన్నప్పటి నుంచి ఆమె చదువు బాధ్యత అంతా అక్షయ్‌నే చూసుకున్నాడు. తనతో కలిసి కొత్త పదాలు నేర్చుకోవడం, చదవడం, వినడం వంటివి చేస్తానని పలుమార్లు ఇంటర్వ్యూలలో చెప్పారు అక్షయ్. అలాగే ఆమెకు కథ చెప్పే నైపుణ్యం నేర్పించడమే గాక, కొన్ని విలువలను కథల రూపంలో అర్థమయ్యేలా వివరించేవాడినని అంటారు అక్షయ్.
కూతురికి తండ్రిగా ఉండటాన్ని గర్వంగా ఫీలవుతాడు..
కూతురికి తండ్రి అవ్వటం సిగ్గుపడే విషయం కాదని అంటాడు. తన కూతురు నితారాతో కలిసి డాల్ హౌస్‌లను నిర్మించడం, ఆమె క్రియేటివిటీని తన కాలి గోళ్లపై నెయిల్ పాలిష్ రూపంలో ఆమె చేత వేయించుకుంటాడు. పిల్లలు ఎలా ఉండాలనుకుంటారో అలానే ఫ్రీగా ఉండనిస్తా..ఎట్టిపరిస్థితుల్లోనూ బలవంతం చెయ్యను. కొన్ని విషయాల్లో మాత్రం హద్దులు పెడతాను, స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన వాటిల్లో ఉంటానని నొక్కి చెబుతున్నారు అక్షయ్. పిల్లలకు సరైన విలువలను నేర్పడం అత్యంత ముఖ్యం. అవే తన తల్లిదండ్రులు తనకు నేర్పించారని తాను కూడా వారి బాటనే అనుసరిస్తున్నానని సగర్వంగా చెప్పారు.
జీవిత పాఠాలు..
అక్షయ్ తన పిల్లలు కష్టపడి సంపాదించటం గురించి, దాని ప్రాముఖ్యతను తెలుసుకునేలా చూసుకుంటానని అన్నారు. కొడుకు ఆరవ్‌కి కష్టం విలువ నేర్పించాడు. అలాగే నైతికత అంటే చెబుతానని, కష్టపడి పనిచేస్తేనే ప్రత్యేక హక్కు వస్తుందని వివరిస్తానని చెప్పారు. ఇటీవల తాము సెలవుల్లో విహార యాత్రకు వెళ్లాలనుకున్నాం. అయితే తన కొడుకు ఆరవ్ బిజినెస్ క్లాస్‌లో వెళ్లాలనుకున్నాడు.
అందుకోసం కష్టపడి మంచి మార్కులు తెచ్చుకుంటేనే తల్లిదండ్రులను ఖరీదైన కోరికలు కోరుకునే హక్కు ఉంటుందని చెప్పాను. ఆరవ్ కూడా దాన్నే నిజం చేస్తూ..ఫస్ట్-డిగ్రీ బ్లాక్ బెల్ట్ సాధించి తన కోరిక నెరవేర్చుకున్నాడని వివరించారు. ఇలాంటివే పిల్లలకు నేర్పించాలే తప్ప ఏది అడిగితే అదే తెచ్చే తండ్రిలా పెంచి పిల్లలను భారంగా మార్చుకోవద్దని సూచిస్తున్నారు అక్షయ్. అలాగే కృజ్ఞతతో కలిగి ఉండటం, బాధ్యతయుతంగా వ్యవహరించడం వంటివి తెలియజేయాలని చెబుతున్నారు.
పనులు పంచుకోవడం..
ప్రతి ఒక్కరికీ కుటుంబ సమయం ముఖ్యం. పిల్లలు తమ తల్లితో సమయం గడపేలా తండ్రే బాధ్యత తీసుకోవాలి. అందుకే తాను కొన్ని ఇంటి పనుల్లో బాధ్యత తీసుకుంటానని అన్నారు. తద్వారా ఇంటి భారమంతా మహిళలపైనే పడదు. అలాగే ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. పిల్లలను తన భార్య ట్వింకిల్ ఖన్నా చాలా బాగా పెంచిందన్నారు. నిజానికి వివాహం తర్వాత ఆమె నన్ను కూడా తల్లిలా బాగా చూసుకుందని ఆనందంగా చెప్పారు. ఇక్కడ తల్లిదండ్రులుగా పిల్లలకు కలిసి నేర్పించాల్సిన విషయాలు, విలువలను ఇరువురు సఖ్యతతో నేర్పిస్తేనే..పిల్లలు మంచిగా పెరుగుతారని చెప్పకనే చెప్పారు.
(చదవండి: నోట్లో వేసుకుంటే కరిగిపోయే 'పైన్ నట్స్'..ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!)
Comments
Please login to add a commentAdd a comment