World Test Championship 2021-23: దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 1-2 తేడాతో చేజార్చుకున్న టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి దిగజారింది. కేప్‌టౌన్ టెస్ట్‌లో పరాభవానికి ముందు నాలుగో స్థానంలో ఉన్న టీమిండియా.. ఓ స్థానాన్ని కోల్పోయి ఐదో ప్లేస్‌కు పడిపోగా.. టీమిండియాపై చారిత్రక సిరీస్ విజయాన్ని సాధించిన దక్షిణాఫ్రికా.. ఐదో స్థానం నుంచి నాలుగో స్థానానికి ఎగబాకింది.
డబ్ల్యూటీసీ 2021-23లో భాగంగా జరిగిన 9 మ్యాచ్‌ల్లో టీమిండియా 4 విజయాలు, 3 పరాజయాలు, 2 డ్రాలతో 49.07 పాయింట్ల శాతాన్ని(53 పాయింట్లు) సాధించగా.. సఫారీ జట్టు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయంతో 66.66 పాయింట్ల శాతాన్ని(24 పాయింట్లు) నమోదు చేసింది. ఇక ఆడిన రెండు టెస్ట్‌ల్లోనూ విజయాలు సాధించిన శ్రీలంక.. 100 శాతం పాయింట్లతో(24 పాయింట్లు) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఆసీస్.. 4 మ్యాచ్‌ల్లో ఓ డ్రా, 3 విజయాలతో 83.33 పాయింట్ల శాతాన్ని(40 పాయింట్లు) సాధించి రెండో ప్లేస్‌లో కొనసాగుతుంది.
ఈ జాబితాలో పాకిస్థాన్ 36 పాయింట్ల(4 టెస్ట్‌ల్లో 3 విజయాలు, ఓ పరాజయంతో 75 శాతం పాయింట్లు)తో మూడో స్థానంలో నిలువగా.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు వరుసగా 6, 7, 8, 9 స్థానాల్లో నిలిచాయి. ఇదిలా ఉంటే, కేప్‌టౌన్ టెస్ట్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పరాజయంపాలై, సఫారీ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలిచే సువర్ణావకాశాన్ని చేజార్చుకున్న విషయం తెలిసిందే.
చదవండి: IPL 2022: కేకేఆర్ బౌలింగ్ కోచ్‌గా టీమిండియా మాజీ క్రికెటర్..
Comments
Please login to add a commentAdd a comment