టీ20 ప్రపంచకప్-2022లో దక్షిణాఫ్రికా బోణీ కొట్టింది. సూపర్-12లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ప్రోటీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
సెంచరీతో చెలరేగిన రిలీ రోసో
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బ్యాటర్ రిలీ రుసౌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కెప్టెన్ బావుమా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రోసౌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 56 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ డికాక్ 63 పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో షకీబ్ ఆల్ హసన్ రెండు వికెట్లు పడగొట్టగా, హసన్ మహ్మద్, టాస్కిన్ అహ్మద్ తలా వికెట్ సాధించారు.
నిప్పులు చేరిగిన నోర్జే
206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ప్రోటీస్ పేసర్ అన్రిచ్ నోర్జే చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన నోర్జే.. బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. అతడిపాటు స్పిన్నర్ షమ్సీ కూడా మూడు వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బ తీశాడు. ప్రోటీస్ బౌలర్ల ధాటికి బంగ్లా టైగర్స్ 101 పరుగులకే కుప్పకూలింది.
నెం1 స్థానంలో దక్షిణాఫ్రికా
బంగ్లాదేశ్‌పై అద్భుతమైన విజయం సాధించిన దక్షిణాఫ్రికా గ్రూప్-2 నుంచి పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి చేరుకుంది. అదే విధంగా ధక్షిణాఫ్రికా రన్‌రేట్(+5.200) కూడా భారీగా మెరుగు పడింది. ఇక జింబాబ్వేతో జరిగిన తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. దీంతో జింబాబ్వే, దక్షిణాఫ్రికా జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా ఈ మ్యాచ్‌లో ప్రోటీస్ గెలుపు దగ్గరగా ఉన్న సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ రద్దైంది.
చదవండి: T20 WC 2022: పాపం బంగ్లాదేశ్.. 5 పరుగుల పెనాల్టీ! ఎందుకంటే?
Comments
Please login to add a commentAdd a comment