టీమిండియా చేతిలో వైట్‌వాష్‌కు గురైన బంగ్లాదేశ్ ఆట తీరు ఏ మాత్రం మారలేదు. ఢాకా వేదికగా సౌతాఫ్రికాతో ప్రారంభమైన మొదటి టెస్టులో బంగ్లాదేశ్ దారుణ ప్రదర్శన కనబరిచింది. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా బౌలర్లు నిప్పులు చేరిగారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు సఫారీ బౌలర్లు చుక్కలు చూపించారు. సౌతాఫ్రికా పేసర్ల దాటికి బంగ్లా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. రబడా, ముల్డర్, కేశవ్ మహారాజ్ తలా మూడు వికెట్లతో బంగ్లా పతనాన్ని శాసించారు.
బంగ్లా బ్యాటర్లలో మెహదీ హసన్ జాయ్(30) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా బంగ్లాదేశ్ గత నెలలో భారత్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో కోల్పోయింది.
తుది జట్లు
బంగ్లాదేశ్: షాద్‌మన్ ఇస్లాం, మహ్మదుల్ హసన్ జాయ్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, లిట్టన్ దాస్(వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, నయీమ్ హసన్, తైజుల్ ఇస్లాం, హసన్ మహమూద్
దక్షిణాఫ్రికా : టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, ర్యాన్ రికెల్టన్, మాథ్యూ బ్రీట్జ్‌కే, కైల్ వెర్రెయిన్నే(వికెట్ కీపర్), వియాన్ ముల్డర్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, డేన్ పీడ్
Comments
Please login to add a commentAdd a comment