SA vs BAN: దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్లు దూరం | South Africa Announces Squad For Test Series Against Bangladesh | Sakshi
Sakshi News home page

SA vs BAN: దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్లు దూరం

Published Mon, Sep 30 2024 7:51 PM | Last Updated on Mon, Sep 30 2024 8:03 PM

South Africa Reveal Squad For Bangladesh Tests

బంగ్లాదేశ్‌తో జ‌ర‌గ‌నున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 15 మంది స‌భ్యుల‌తో కూడిన త‌మ జ‌ట్టును ద‌క్షిణాఫ్రికా క్రికెట్ ప్ర‌క‌టించింది. ఈ జ‌ట్టుకు టెంబా బావుమా సార‌థ్యం వ‌హించ‌నున్నాడు. అదే విధంగా దాదాపు ఏడాదిన్న‌ర స్పిన్న‌ర్ సెనూరన్ ముత్తుసామికి ప్రోటీస్ టెస్టు జ‌ట్టులో చోటు ద‌క్కింది.

అయితే ఈ సిరీస్‌కు  అన్రిచ్ నోర్జే, మార్కో జాన్సెన్, లుంగి ఎంగిడీ, గెరాల్డ్ కోయెట్జీ వంటి వంటి స్టార్ పేస‌ర్లు దూర‌మ‌య్యారు. జాన్సెన్‌, కోయిట్జేల‌కు విశ్రాంతి ఇవ్వ‌గా.. ఎంగిడీ, నోర్జేల‌ను సెల‌క్ట‌ర్లు ఎందుకు ప‌క్క‌న పెట్టారో తెలియ‌లేదు.

బంగ్లా సిరీస్‌లో స‌ఫారీల పేస్ ద‌ళానికి క‌గిసో ర‌బాడ నాయ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఫాస్ట్ బౌల‌ర్ల కోటాలో ర‌బాడ‌తో పాటు బ‌ర్గ‌ర్‌, డేన్ ప్యాటర్సన్,ముల్డ‌ర్‌ల‌కు చోటు ల‌భించింది.

గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చిన ద‌క్షిణాఫ్రికా క్రికెట్..
కాగా బంగ్లాదేశ్‌లో నెల‌కొన్న రాజకీయ అనిశ్చితి కార‌ణంగా ఈ టెస్టు సిరీస్‌పై సందిగ్ధం నెల‌కొంది. అయితే తమ ఆటగాళ్ల భద్రతపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు హామీ ఇవ్వడంతో దక్షిణాఫ్రికా క్రికెట్‌ తమ జట్టు పర్యటనకు గ్రీన్ సిగ్నల్‌ఇచ్చింది. ఆక్టోబర్‌ 21 నుంచి ఢాకా వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.
బంగ్లాతో టెస్టులకు దక్షిణాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, మాథ్యూ బ్రీట్జ్‌కే, నాండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, కేశవ్ మహరాజ్, ఐడెన్ మార్క్‌రామ్, వియాన్ ముల్డర్, సెనూరన్ ముత్తుసామి, డేన్ ప్యాటర్సన్, డేన్ పీడ్ట్, కగిసో రబడ, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికల్టన్ వెర్రేన్నే(వికెట్ కీపర్‌)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement