వన్డే ప్రపంచకప్-2023కు ముందు దక్షిణాఫ్రికాకు గట్టి ఎదురు దెబ్బతగిలింది. అంతా ఊహించినట్టుగానే ఆ జట్టు స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, సిసిందా మగాల గాయాల కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యారు. వరల్డ్‌కప్‌కు ప్రకటించిన 15 మంది సభ్యుల ప్రోటీస్ జట్టులో వీరిద్దరూ భాగంగా ఉన్నారు. ఇక వీరిద్దరి స్ధానాలను ఫాస్ట్ బౌలర్లు ఆండిలే ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్‌లతో దక్షిణాఫ్రికా క్రికెట్ భర్తీ చేసింది.
ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా వైట్-బాల్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ ధృవీకరించాడు. కాగా నోర్జే వెన్నుగాయంతో బాధపడుతుండగా.. మగాల మోకాలి గాయంతో తప్పుకున్నాడు.అన్రిచ్, సిసిందా ఇద్దరూ వరల్డ్‌కప్‌కు దూరం కావడం మాకు పెద్ద ఎదురుదెబ్బ. ఇది మమ్నల్ని చాలా నిరాశపరిచింది. వారిద్దరూ మా జట్టుకు చాలా విలువైన బౌలర్లు. వారు రీ ఎంట్రీ ఇవ్వడానికి మా సపోర్ట్ ఎల్లప్పడూ ఉంటుంది.
వీరి స్ధానంలో ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్‌లకు అవకాశం ఇచ్చాం. వీరిద్దరూ కూడా ఆస్ట్రేలియాతో జరిగిన వైట్ బాల్ సిరీస్‌లలో ప్రోటీస్‌కు ప్రాతినిథ్యం వహించారు. వారు తమ టాలెంట్‌ను చూపించడానికి ఇదొక మంచి అవకాశమని ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో రాబ్ వాల్టర్ పేర్కొన్నాడు. ఇక వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 7న ఢిల్లీ వేదికగా శ్రీలంకతో తలపడనుంది.
చదవండి: ODI World Cup: పిచ్ క్యూరేటర్‌లకు ఐసీసీ కీలక ఆదేశాలు..
Comments
Please login to add a commentAdd a comment