
వన్డే ప్రపంచకప్-2023 ప్రారంభానికి ముందు బుధవారం అహ్మదాబాద్‌లో కెప్టెన్స్ మీట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మీట్‌కు 10 జట్ల కెప్టెన్‌లు హాజరయ్యారు. అయితే ఈ మీట్ సందర్భంగా దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ టెంబా బావుమా నిద్రపోతున్నట్లు సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరలవుతోంది. అయితే తాజాగా ఈ విషయంపై బావుమా స్పందించాడు.
కెప్టెన్సీ మీట్‌లో తానేమి నిద్రపోలేదని బావుమా తెలిపాడు. ఆ ఫోటో తప్పుదోవ పట్టడానికి కారణం కెమెరా యాంగిల్ అని బావుమా సృష్టం చేశాడు. బవుమా కెప్టెన్స్ కాన్ఫరెన్స్‌లో కళ్లుమూసుకుని ఉన్న ఫోటోను ఇంగ్లండ్ బార్మీ ఆర్మీ ఎక్స్(ట్విటర్) షేర్ చేసింది.
అందుకు ప్రతిస్పందనగా బావుమా.. నేను నిద్రపోలేదు. కెమెరా యాంగిల్ కారణంగానే అలా కన్పిస్తోందని" ట్విట్ చేశాడు. ఇక ఈ మెగా టోర్నీకి మరి కొన్ని గంట్లలో తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
చదవండి: టీమిండియా స్టార్ క్రికెటర్‌కు విడాకులు మంజూరు..
Temba Bavuma has just fallen asleep in the World Cup captain's conference pic.twitter.com/GqQXZ3MenG
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) October 4, 2023