పోలీస్‌ వ్యవస్థపై పెరుగుతున్న నమ్మకం | interesting points from the Gallup Global Safety Report | Sakshi
Sakshi News home page

పోలీస్‌ వ్యవస్థపై పెరుగుతున్న నమ్మకం

Published Wed, Sep 25 2024 10:04 AM | Last Updated on Wed, Sep 25 2024 10:39 AM

interesting points from the Gallup Global Safety Report

ప్రపంచ దేశాల్లో శాంతి భద్రతా అంశాలపై అమెరికాకు చెందిన గాలప్‌ సంస్థ తన వార్షిక నివేదికలో పలు ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఒక దశాబ్దకాలం క్రితం కంటే.. నేడు ఎంతో సురక్షితంగా ఉన్నామని భావిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది. 

👉గ్లోబల్ సేఫ్టీ ట్రెండ్‌లను అనుసంచి.. 2023లో ప్రపంచవ్యాప్తంగా 70 శాతం మంది పెద్దలు రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితంగా భావించారు. ఆసియా, పసిఫిక్, పశ్చిమ ఐరోపా దేశాలలోని 75 శాతం మంది భద్రత విషయంలో ఇటువంటి అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. ఉత్తర ఆఫ్రికాలో 74 శాతం మంది ఈ అభిప్రాయంతో ఏకీభవించారు.

👉యురేషియా ప్రాంతానికి చెందిన 20,063 మంది ఈ సర్వేలో పాల్గొనగా, ఇక్కడ భద్రత విషయంలో 34 శాతం పాయింట్ల మెరుగుదల కనిపించింది. దీంతో యూరేషియా భద్రత విషయంలో గణనీయమైన అభివృద్ధి సాధించిందని చెప్పుకోవచ్చు. 

👉ఇక భద్రతపై ఆందోళన కలిగించే ప్రాంతాల విషయానికొస్తే ఉప సహారా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్‌లు అత్యల్ప భద్రతను కలిగి ఉన్నాయని తేలింది.  

👉పోలీసులపై నమ్మకం విషయానికొస్తే 2023లో ప్రపంచవ్యాప్తంగా 71 శాతం మంది ప్రజలు స్థానిక పోలీసులపై నమ్మకాన్ని కలిగివున్నట్లు తెలిపారు.  ఇది దశాబ్ధకాలంతో పోలిస్తే 62 శాతానికి  పెరిగింది. కాగా ఈక్వెడార్  భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. 

👉2023లో కేవలం 27శాతం ఈక్వెడారియన్లు మాత్రమే రాత్రిపూట ఒంటరిగా నడవడం సురక్షితమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

👉ఇజ్రాయెల్‌లో సంఘర్షణల ప్రభావం భద్రతా లేమిని స్పష్టంగా చూపింది. హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌లో భద్రతతో ఉ‍న్నామనే భావన అక్కడి వారిలో మరింతగా క్షీణించింది. 2022లో ఈ అంశం 82 పాయింట్లుగా ఉండగా, ఇప్పుడది 68 శాతానికి పడిపోయింది.

ఇది కూడా చదవండి: కమలా హారీస్‌ ఆఫీసుపై కాల్పులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement