వైద్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు తీపికబురు  | Good news for contract employees of the medical department | Sakshi
Sakshi News home page

వైద్య శాఖ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు తీపికబురు 

Published Fri, Sep 15 2023 4:15 AM | Last Updated on Fri, Sep 15 2023 4:59 PM

Good news for contract employees of the medical department - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2018కి ముందు కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన శాంక్షన్‌ పోస్టుల్లో నియమితులైన సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్, పారా మెడికల్‌ సిబ్బందికి వంద శాతం గ్రాస్‌ వేతనం (పే+హెచ్‌ఆర్‌ఏ+డీఏ) పునరుద్ధరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్‌ వేతనాన్ని రద్దు చేసి.. కన్సాలిడేట్‌ పేకి కుదించారు.

ఈ నేపథ్యంలో వారంతా 2019కు ముందు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద శాతం గ్రాస్‌ వేతనం వర్తింపజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2018 తర్వాత నియమించబడి అర్హత ఉన్న ఉద్యోగులకు ఈ వేతనాలు వర్తింపజేసేలా ప్రతిపాదనలు పంపించాల్సిందిగా విభాగాధిపతులను ఆదేశించారు.  

సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం  
పారా మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు వంద శాతం గ్రాస్‌ వేతనం వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్‌ వేతనం రద్దు చేసి మాకు అన్యాయం చేశారు. సీఎం జగన్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 3,914 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. కేడర్‌ను బట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ వేతనాలు పెరుగుతాయి. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటాం. – రత్నాకర్, ప్రెసిడెంట్, ఏపీ స్టేట్‌ కాంట్రాక్ట్‌ పారా మెడికల్, ల్యాబ్‌ టెక్నీషియన్స్‌ అసోసియేషన్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement