gross
-
పుష్పరాజ్ ఆల్ టైమ్ రికార్డ్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?
'పుష్ప 2' తొలిరోజు నుంచే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏకంగా రూ.294 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుని.. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్ని తుడిచిపెట్టేసింది. అలా దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తొలిరోజు రూ.294 కోట్లు కలెక్షన్స్ సాధించిన 'పుష్ప 2'.. రెండో రోజు కాస్త తగ్గింది. రూ.155 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. అలా రెండు రోజులకు కలిపి రూ.449 కోట్లు రాబట్టింది. తాజాగా మూడు రోజుల్లోనే ఏకంగా రూ.621 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఈ విషయాన్ని నిర్మాణసంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.హిందీలో తొలిరోజు రికార్డ్ బ్రేక్అయితే పుష్ప -2 హిందీలో ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. తొలి రోజు రూ.72 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన పుష్ప-2 మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మూడో రోజు ఏకంగా రూ.74 కోట్లతో ఆ రికార్డ్‌ను తిరగరాసింది. దీంతో కేవలం హిందీలోనే మూడు రోజుల్లో రూ.205 కోట్లకు పైగా నెట్ వసూళ్లు రాబట్టింది. ఇక ముందుముందు మరెన్ని రికార్డులు కొల్లగొడుతందో ప్రస్తుత కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తోంది. నార్త్‌లోనూ పుష్ప-2 రప్పా రప్పా అంటూ రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. The box office is witnessing history with #Pushpa2TheRule ❤🔥The WILDFIRE BLOCKBUSTER collects a gross of 621 CRORES WORLDWIDE in just 3 days, shattering many records 💥💥💥Book your tickets now!🎟️ https://t.co/tHogUVEOs1#Pushpa2#WildFirePushpaIcon Star @alluarjun… pic.twitter.com/CQ1SBTAnV4— Mythri Movie Makers (@MythriOfficial) December 8, 2024 -
వైద్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపికబురు
సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో 2018కి ముందు కాంట్రాక్ట్ ప్రాతిపదికన శాంక్షన్ పోస్టుల్లో నియమితులైన సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, పారా మెడికల్ సిబ్బందికి వంద శాతం గ్రాస్ వేతనం (పే+హెచ్ఆర్ఏ+డీఏ) పునరుద్ధరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్ వేతనాన్ని రద్దు చేసి.. కన్సాలిడేట్ పేకి కుదించారు. ఈ నేపథ్యంలో వారంతా 2019కు ముందు ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలను తెలియజేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. 2018 తర్వాత నియమించబడి అర్హత ఉన్న ఉద్యోగులకు ఈ వేతనాలు వర్తింపజేసేలా ప్రతిపాదనలు పంపించాల్సిందిగా విభాగాధిపతులను ఆదేశించారు. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం పారా మెడికల్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు వంద శాతం గ్రాస్ వేతనం వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. టీడీపీ హయాంలో వంద శాతం గ్రాస్ వేతనం రద్దు చేసి మాకు అన్యాయం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో 3,914 మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది. కేడర్‌ను బట్టి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకూ వేతనాలు పెరుగుతాయి. జీవితాంతం సీఎంకు రుణపడి ఉంటాం. – రత్నాకర్, ప్రెసిడెంట్, ఏపీ స్టేట్ కాంట్రాక్ట్ పారా మెడికల్, ల్యాబ్ టెక్నీషియన్స్ అసోసియేషన్ -
టాలీవుడ్ లో 2018 మూవీ సంచలనం తొలి రోజే కోటి రూపాయల గ్రాస్
-
100 కోట్లు గ్రాస్...!
-
Pushpa Move : బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన 'పుష్ప'.. బాక్సాఫీస్ ప్రభంజనం
Pushpa Movie First Day Box Office Collections: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన 'పుష్ప' చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(డిసెంబర్17)న విడుదలైన ఈ చిత్రం రిమార్కబుల్ ఓపెనింగ్స్‌తో దుమ్మురేపుతుంది. ఈ ఏడాది విడుదలైన చిత్రాలన్నింటిలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఈ చిత్రం తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ.71 కోట్ల గ్రాస్ రాబట్టిందని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది. ఇది 2021లో ఇండియాలోనే తొలి రోజు అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమా అని.. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందని మేకర్స్ తెలిపారు. కాగా ఈ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్-2కూడా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప: ది రూల్'(Pushpa: The rule)టైటిల్‌తో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 2021 INDIA'S BIGGEST DAY 1 GROSSER 🔥#PushpaTheRise strikes big at the Box Office 💥 MASSive 71CR Gross Worldwide🤘#ThaggedheLe 🤙#PushpaBoxOfficeSensation @alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @TSeries @PushpaMovie pic.twitter.com/FwRvqNVl7m — Mythri Movie Makers (@MythriOfficial) December 18, 2021 -
పచ్చిమేతల ఎంపిక ఎలా?
మేలు జాతి పాడి పశువుల పెంపకం లాభదాయకంగా చేపట్టాలనుకునే రైతులు పచ్చిమేత, పశు దాణా ప్రాముఖ్యత గురించి శాస్త్రీయ అవగాహన పెంచుకోవాలి. పాడి పశువుల పెంపకంలో 60–70% నిర్వహణ ఖర్చు మేపు పైనే ఉంటుంది. మేపు ఖర్చు ఎంత తగ్గితే నికర లాభం అంత పెరుగుతుంది. డెయిరీ రైతులు మేలు జాతి పాడి పశువులను ఎంపిక చేసుకొని పోషిస్తున్నప్పటికీ.. వాటిలో జన్యుపరంగా అధిక పాలిచ్చే లక్షణాలున్నప్పటికీ – వాటికి తగినంత మేత, పాల ఉత్పత్తికి అనుగుణంగా దాణా ఇచ్చినప్పుడే ఆశించిన పాల ఉత్పత్తి పొందగలరు. మేలైన పచ్చి మేతల ఎంపిక, పెంపకం, వినియోగంపై వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా రైతులు పశువులకు అందించే వడిగడ్డి, చొప్ప లాంటి ఎండు మేత వాటి కడుపు నిండడానికి మాత్రమే సరిపోతుంది. కానీ ఎండుమేతలో ఎలాంటి పోషక పదార్థాలుండవు. కాబట్టి పశుమేతలో ఎండు మేతతో పాటు తప్పనిసరిగా పచ్చిమేత కూడా ఉండాలి. పచ్చిమేతలో కూడా పప్పుజాతి(ద్విదళం) పచ్చిమేత ఒక పాలు, ధాన్యపు జాతి(ఏకదళం) పచ్చిమేత మూడు పాళ్లు మేపాలి. పశువు బరువుననుసరించి 25–30 కిలోల వరకు మేపినట్లయితే తగిన రీతిలో పాల ఉత్పత్తి జరుగుతుంది. అంతేగాక 5 లీటర్లకు మించి పాలు ఉత్పత్తి సామర్థ్యం గల పశువులకు పచ్చిమేతతోపాటు సమీకృత దాణా అందించవలసి ఉంటుంది. పాడి పశువుల శరీర అవసరాలను బట్టి మేపును రెండు రకాలుగా విభజించవచ్చు. 1. నిర్వాహక మేపు. 2. ఉత్పత్తి మేపు. నిర్వాహక మేపు: గడ్డికి సంబంధించినది. గడ్డి పశువుకు కడుపు నింపి, సంతృప్తిని, శరీర నిర్వహణకు అవసరమయ్యే పోషకాలను అందిస్తుంది. అందుకే పశుగ్రాసాన్ని పశువు శరీర బరువును బట్టి ఎంత పరిమాణంలో కావాలో లెక్కించి ఇవ్వవలసి ఉంటుంది. ఉత్పత్తి మేపు: దాణాకు సంబంధించింది. దాణా ద్వారా లభించే పోషకాలు పాల ఉత్పత్తికి ఎక్కువగా ఉపయోగపడతాయి. కాబట్టి నిర్వాహక మేపు, ఉత్పత్తి మేపుపై తగు శ్రద్ధవహించవలసి ఉంటుంది. ఎకరంలో పెరిగే పచ్చిమేతను 5–6 పశువులకు మేపవచ్చు పచ్చిమేతలో ఉండే విటమిన్–ఎ వలన పశువులు ఆరోగ్యంగా ఉండి, సకాలంలో చూలు కట్టి పాల ఉత్పాదన పెరుగుతుంది. ఉత్పత్తి ఖర్చులు తగ్గి పాల ఉత్పత్తి లాభసాటిగా ఉంటుంది. రోజుకు ఒక పాడి పశువుకు 30–40 కిలోల చొప్పున, సంవత్సరానికి 11–12 టన్నుల పచ్చిమేత అవసరమవుతుంది. నీటి వసతి గల ఎకరం భూమిలో పండించే పచ్చిమేత 5–6 పశువుల పోషణకు సరిపోతుంది. వర్షాధార భూములలో సాగు చేస్తే రెండు పశువులకు సరిపోతుంది. పాడి రైతులు పచ్చిమేతను కొని మేపలేరు. సొంత భూమిలో లేదా కౌలు భూమిలోనైనా సొంతంగానే సాగు చేసుకోవాలి. దీని ద్వారా సంవత్సరం పొడవునా పచ్చిమేత పొందడమే కాక దాణా ఖర్చును కూడా కొంతమేర తగ్గించుకోవచ్చు. పచ్చిమేత, ఎండుమేత ఎంతెంత ఇవ్వాలి? పాల దిగుబడిని బట్టి పాడి పశువులకు తగినంత దాణాతోపాటు రోజుకు పచ్చిమేత, ఎండుమేతలను నిర్దేశిత మోతాదు ప్రకారం ఇవ్వడం ద్వారా లాభదాయకంగా పాల దిగుబడి పొందవచ్చు. పచ్చిమేత లభించే కాలంలో కిలో నుంచి 3 కిలోల మధ్య పశువు గేదా, ఆవా అన్నదాన్ని బట్టి, ఎంత పాల దిగుబడి ఉందన్న దాన్ని బట్టి తగిన పరిమాణంలో సమీకృత దాణా ఇవ్వాల్సి ఉంటుంది. మేలురకం పచ్చిమేత విత్తనాలు, బహువార్షిక పశుగ్రాసాల సాగుకు పిలకల కొరకు సమీప పశువైద్యశాలల్లోని నిపుణులను సంప్రదించవచ్చు. (వివిధ రకాల పచ్చి మేత రకాలసాగు వివరాలు.. వచ్చే వారం) -
గడ్డివామి దగ్ధం
బొమ్మనహాళ్(రాయదుర్గం) : గోవిందవాడ గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు వరి గడ్డివామి దగ్ధమైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో బీడీ తాగి ఆర్పకుండా పడేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని బాధిత రైతు కుమారస్వామి తెలిపాడు. దాదాపు రూ.80వేల నష్టం వాటిల్లిందని ఎస్ఐ శ్రీరామ్ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసి, తహసీల్దార శివయ్యకు రాతపూర్వకంగా అర్జీ అందజేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాని విజ్ఞప్తి చేశారు.