AP CM YS Jagan Review Meeting on Department of Energy - Sakshi
Sakshi News home page

వేసవిలో విద్యుత్‌ కొరత ఉండకూడదు: సీఎం జగన్‌

Published Fri, Feb 24 2023 1:03 PM | Last Updated on Fri, Feb 24 2023 3:19 PM

Cm Ys Jagan Review Meeting On Energy Department - Sakshi

సాక్షి, అమరావతి: వేసవిలో విద్యుత్‌ కొరత అనేది ఉండకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. విద్యుత్‌ కొరత కారణంగా కరెంటు కోతలు అనే సమస్య ఉత్పన్నం కాకాడదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు అన్ని రకాలుగా సిద్ధం కావాలని సూచించారు సీఎం జగన్‌. ఇంధనశాఖపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సమీక్షా సమావేశానికి విద్యుత్‌, అటవీ పర్యావరణం, మైన్స్‌ అండ్‌ జియాలజీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, పరిశ్రమల శాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఆర్ధిక శాఖ కార్యదర్శి ఎన్‌. గుల్జార్‌, ట్రాన్స్‌కో జేఎండీ పృధ్వీతేజ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ కామెంట్స్‌

  • బొగ్గు నిల్వల విషయంలో కూడా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి:
  • థర్మల్‌ కేంద్రాలకు బొగ్గు కొరతరాకుండా అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలి:
  • రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెట్టుకునే వ్యవసాయ కనెక్షన్లపై కీలక నిర్ణయం.
  • ఏ నెలలో దరఖాస్తు చేసుకుంటే అదే నెలలో మంజూరుచేయాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తామన్న అధికారులు. 
  • రైతులకు కనెన్షన్ల మంజూరులో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టంచేసిన సీఎం.
  • ఇదివరకే దరఖాస్తు చేసుకున్న వారికి 1.06లక్షల కనెక్షన్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మంజూరు చేశామన్న అధికారులు.
  • మార్చి నాటికి మరో 20వేల కనెక్షన్లుపైగా మంజూరు చేస్తున్నట్టు వెల్లడి.
  • విద్యుత్‌ సరఫరా నాణ్యతను పెంచాలన్న సీఎం ఆదేశాల మేరకు అనేక చర్యలు తీసుకున్నామని తెలిపిన అధికారులు.
  • రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 100 విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం పూర్తవుతున్నట్టు వెల్లడించిన అధికారులు.
  • మార్చి నెలాఖరు నాటికి వీటిని పూర్తిచేస్తున్నామన్న అధికారులు.
  • అలాగే పేదలందరికీ ఇళ్లు పథకం కింద నిర్మాణాలు పూర్తిచేసుకుంటున్న వారికి వెంటనే కనెక్షన్లు మంజూరుచేస్తున్నామని వెల్లడి.
  • ఇప్పటికే 2.18లక్షలకుపైగా ఇళ్లకు  కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించిన అధికారులు.
  • ఇళ్లు పూర్తవుతున్నకొద్దీ.. వాటికి కనెక్షన్లు శరవేగంగా ఇస్తున్నామని వెల్లడి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement