వైద్యం ప్రజలకు చేరువ కావాలి
వైద్యం ప్రజలకు చేరువ కావాలి
Published Tue, Apr 25 2017 11:50 PM | Last Updated on Tue, Sep 5 2017 9:40 AM
జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా
కాకినాడ సిటీ : వైద్య ఆరోగ్య సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మాతా శిశు సంరక్షణ పథకాల పటిష్ట అమలుకు చర్యలు చేపట్టాలన్నారు. స్వైన్‌ప్లూ, మలేరియా వంటి వ్యాధులపై ప్రజలకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించారు. తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణ కోసం యాంటీనేటల్ రిజిస్ట్రేషన్లు పెంచాలని, ఆసుపత్రులలో ఉన్న 48 శాతం ప్రసవాల సంఖ్యను మరింత పెంచేందుకు కృషి చేయాలన్నారు. బాలస్వాస్థ కార్యక్రమంలో విద్యార్థులకు నిర్వహిస్తున్న వైద్య చికిత్సల తర్వాత నిపుణులైన వైద్యులతో చికిత్స అందించాలన్నారు. ఏజెన్సీ, సబ్‌ప్లాన్ ఏరియాల్లో మలేరియా తీవ్రత పెరిగిన గ్రామాలను గుర్తించి, అక్కడ ప్రత్యేకంగా యాంటీ మలేరియా పథకాలను అమలు చేయాలని ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఉద్యోగులందరికీ ప్రత్యేక హెల్త్ ప్రొఫైల్ తయారు చేయాలని సూచించారు. రాజమహేంద్రవరం, అమలాపురంలో మే నెలలో వైద్య పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. వైద్య శిబిరాలు రెండు రోజుల నుంచి నాలుగు రోజులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. జేసీ–2 రాధాకృష్ణమూర్తి, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రమేష్‌కిషోర్, పలువురు వైద్యులు పాల్గొన్నారు.
దిగుబడులు పెంచేలా చర్యలు
జిల్లాలోని శివారు ప్రాంత ఆయకట్టు పంట భూములకు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టి, దిగుబడులు పెంచేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ వ్యవసాయశాఖ, ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టెరేట్ కోర్టు హాల్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శివారు ఆయకట్టు ప్రాంత పంట పొలాలకు నీటి ఎద్దడి లేకుండా చూడాల్సిన బా«ధ్యత సాగునీటి సంఘాలు, అధికారులపై ఉందన్నారు. ఖరీఫ్ –2018 కార్యాచరణ ప్రణాళికను మే 15వ తేదీ నాటికి సిద్ధం చేయాలని సూచించారు. వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్ కేఎస్‌వీ ప్రసాద్, ఇరిగేషన్ ఎస్‌ఈ బి.రాంబాబు, ఆత్మ పిడీ పద్మజ, వ్యవసాయశాఖ డీడీ లక్ష్మణరావు పాల్గొన్నారు.
5వ తేదీలోగా సామాజిక పింఛన్ల పంపిణీ
వృద్ధులు, వితంతువు, వికలాంగులకు ప్రభుత్వం అందజేస్నున్న సామాజిక పింఛన్లను ప్రతి నెలా 5వ తేదీలోగా అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఆర్‌డీఏ పీడీని కలెక్టర్ మిశ్రా ఆదేశించారు. మల్లిబాబు, అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement