రూ.2,807.68 కోట్లు రికవరీ చేస్తాం
పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చి చెప్పిన కేంద్రం
2026 మార్చి నాటికి పూర్తి చేయాలని నిరి్ధష్ట గడువు
ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే మరో ఏడాది పొడిగింపు
కీలకమైన పనులు పూర్తి చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
అందువల్ల రెండేళ్లలో పూర్తి చేయడం సాధ్యమేనంటున్న నిపుణులు
సాక్షి, అమరావతి : నిర్ధిష్ట గడువులోగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన రూ.2,807.68 కోట్లను రుణంగా పరిగణిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఇందులో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనులకుగాను రూ.459.68 కోట్లను రీయింబర్స్ రూపంలో ఇచ్చి0ది. కేబినెట్ ఆమోదించిన సవరించిన షెడ్యూలు ప్రకారం ప్రాజెక్టును 2026 మార్చిలోగా పూర్తి చేయకపోతే అడ్వాన్సు, రీయింబర్స్‌మెంట్‌గా ఇస్తున్న రూ.2,807.68 కోట్లను తిరిగి వసూలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం తేల్చి చెప్పింది.
నిర్మాణ సమయంలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే మరో ఏడాది అంటే 2027 మార్చి వరకు మాత్రమే గడువు పొడిగించే వెసులుబాటును మాత్రమే కలి్పస్తామని స్పషీ్టకరించింది. గోదావరి వరదను మళ్లించేలా స్పిల్ వే, స్పిల్ ఛానల్, ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంల మధ్య ప్రధాన (ఎర్త్ కం రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ ప్రాంతంలో గోదావరి వరదల ఉధృతికి కోతకు గురై విధ్వంసం చోటుచేసుకున్న ప్రాంతాన్ని యథా స్థితికి తెచ్చే పనులను సైతం పూర్తి చేసింది.
అందువల్లే వరద తగ్గగానే అంటే నవంబర్‌లో ప్రధాన డ్యాం గ్యాప్–2 డయాఫ్రం వాల్ నిర్మాణ పనులను ప్రారంభించి, జూలైలోగా పూర్తి చేయడానికి.. ప్రాజెక్టును 2026 మార్చి నాటికి పూర్తి చేయడానికి మార్గం సుగమమైందని నీటి పారుదల రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకునే ప్రాజెక్టును పూర్తి చేయడానికి కేంద్రం రెండేళ్ల గడువు విధించిందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం 41.15 మీటర్ల కాంటూర్ వరకు రూ.30,436.95 కోట్లుగా ఆగస్టు 28న ఆమోదించిన కేంద్ర కేబినెట్.. ఇప్పటిదాకా చేసిన వ్యయంపోనూ మిగతా రూ.12,157.53 కోట్లు ఇచ్చేందుకు అంగీకరించింది.
ఈ క్రమంలోనే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ2,807.68 కోట్లు విడుదల చేయాలని కేంద్ర జల్ శక్తి శాఖ పంపిన ప్రతిపాదనపై కేంద్ర ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేసింది. దాంతో ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వానికి ఈనెల 9న కేంద్ర జల్ శక్తి శాఖ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నిధుల వినియోగానికి మార్గదర్శకాలు ఇలా..
» రాష్ట్ర ప్రభుత్వం జాతీయ బ్యాంకులో ప్రత్యేక ఖాతా తెరవాలి. ఆ ఖాతాలో ఈ నిధులను జమ చేయాలి.
» కేంద్ర కేబినెట్ ఆమోదం మేరకు నిర్దేశించిన పనులకు మాత్రమే ఈ నిధులు వినియోగించాలి.
» ప్రాజెక్టును నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయడానికి.. షెడ్యూలు ప్రకారం పనులు చేయడానికి సమన్వయ వ్యవస్థను ఏర్పాటుచేయాలి.
» విడుదల చేసిన నిధుల్లో 75 శాతం ఖర్చు చేసి, వాటిని ఒప్పందంలో నిర్దేశించిన పనులకు మాత్రమే ఖర్చు చేశామని వినియోగ ధ్రువీకరణపత్రాలు పంపితేనే మిగతా నిధులు ఇస్తాం.
» ఇచ్చిన నిధులను సక్రమంగా ఖర్చు చేశారా లేదా అన్నది తనిఖీ చేయడానికి కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్)కు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి.
Comments
Please login to add a commentAdd a comment