SLBC: ఒక మృతదేహం వెలికితీత | Rescue Operation In Slbc Tunnel 16th Day Continues | Sakshi
Sakshi News home page

SLBC: ఒక మృతదేహం వెలికితీత

Published Sun, Mar 9 2025 7:03 PM | Last Updated on Sun, Mar 9 2025 7:14 PM

Rescue Operation In Slbc Tunnel 16th Day Continues

నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి ఒక మృతదేహాన్ని ఎట్టకేలకు వెలికితీశారు. మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ వెలికి తీసుకొచ్చింది. అతన్ని టీబీఎం ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ గా అనుమానిస్తున్నారు. వెలికితీసిన మృతదేహాన్ని నాగర్‌ కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు.

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఇంకా  8 మంది కార్మికుల జాడ తెలియలేదు. ఇక రోబోల వినియోగం తప్పదని అధికారులు అంటున్నారు. ఆ మేరకు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. 

చివరి 50 మీటర్ల ప్రాంతంలో సహాయక చర్యలు క్లిష్టంగా మారాయి. టెన్నెల్‌ ఎండ్‌ పాయింట్‌లో కీలక స్పాట్స్‌ను గుర్తించారు. కీలకమైన స్పాట్స్‌లో ర్యాట్‌ హోల్‌ మైనర్ల తవ్వకాలు చేపట్టారు. రెస్య్కూలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటున్నారు.

జీపీఆర్‌, కేడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశాలలో చిక్కుకున్న వారి ఆచూకీ కోసం తవ్వకాలు ముమ్మరం చేశారు. టీబీఎంకు ఎడమ పక్కన కనిపించిన ఓ మృతదేహానికి సంబంధించిన చేయిని గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాంక్రీట్‌లో కూరుకుపోయింది. డ్రిల్లింగ్ ద్వారానే బయటికి తీసేందుకు ప్రయత్నాలు చేశారు. ఎట్టకేలకు ఆ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చింది రెస్క్యూ టీమ్.

కాగా,  గత నెల 22వ తేదీన శైలం ఎడమ గట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం తవ్వకం పనుల్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.  సొరంగం పైకప్పు ఒక్కసారిగా కుప్పకూలడంలో 8 మంది లోపలే చిక్కుకుపోయారు. అందులో ఇద్దరు ఇంజనీర్లు, మరో ఇద్దరు మెషీన్‌ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. వారిని కాపాడేందుకు అధికారులు హుటాహుటిన సహాయక చర్యలు చేపట్టారు. కానీ బాధితులు సొరంగంలో 14 కిలోమీటర్ల లోపల శిథిలాలు, బురదలో చిక్కుకుపోవడంతో బయటికి తీసుకురావడం కష్టంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement