గోదావరి జలాలతో మెట్ట పొలాలు సస్యశ్యామలం
Published Mon, Oct 17 2016 10:40 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM
పురుషోత్తపట్నం (సీతానగరం) :
గోదావరి జలాలతో మెట్ట పంట పొలాలు సస్యశ్యామలమవుతాయని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి దేవినేని ఉమా మహేశ్వరావు అన్నారు. పురుషోత్తపట్నంలో కొత్తగా నెలకొల్పే ఎత్తిపోతల పథకం స్థల పరిశీలనకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నుంచి బోట్‌పై పురుషోత్తపట్నం సోమవారం వచ్చారు. పోలవరం ప్రాజెక్టు నేవిగేషన్‌లాక్ వద్ద ఎత్తిపోతల పథకం స్థలాన్ని ఎంపిక చేశారు. ఆ స్థల పరిశీలన అనంతరం ఇంజినీరింగ్ చీఫ్ వెంకటేశ్వరావు, కార్యదర్శి శశిభూషణ్, కలెక్టర్ అరుణ్‌కుమార్, నీటి పారుదల శాఖ ఎస్సీ సుగుణాకరరావు, ఈఈ శ్రీనివాస్‌రెడ్డితో పథకం మ్యాప్‌ను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 10.30 లక్షల ఎకరాలు పట్టిసీమ పథకం ద్వారా 26 నుంచి 27 టీఎంసీల గోదావరి జలాలతో సస్యశ్యామలం అవుతున్నాయని అన్నారు. ఇరిగేషన్ డీఈలు వెంకట్రావు, రవీంద్ర తదితరుల పాల్గొన్నారు
Advertisement
Advertisement