బాడంగి: ఈ నెలాఖరుకు కోటపల్లి కాలువ ద్వారా సాగుకోసం నీళ్లు అందిస్తామని విజయనగరం జిల్లా కలెక్టర్ తెలిపారు. మంగళవారం వేగావతి నదిపై ఉన్న కోటపల్లికాలువ ఎక్యూడేట్‌ను విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్లు పరిశీలించారు. వీరితో పాటు పలువురు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటపల్లి కాలువ 37.75 కిలోమీటర్ల మైలురాయి వద్ద వేగావతి నదిపై నిర్మించిన ఎక్యూడేట్‌లో ఏర్పడిన లీకేజీలను కలెక్టర్లు పరిశీలించారు. ఎక్యూడేట్ నాణ్యతను పరిశీలించి, వెంటనే లీకేజీలను పూడ్చివేయాలని ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్లు ఆదేశించారు. ఈ సందర్భంగా ఈ నెల చివరి కల్లా జిల్లాకు సాగునీటిని అందిస్తామని విజయనగరం కలెక్టరు తెలిపారు.
నెలాఖరుకు కోటపల్లి కాలువ నీళ్లు
Published Tue, Aug 4 2015 2:33 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement
Advertisement