హనుమాన్ జంక్షన్ : కృష్ణా డెల్టా రైతులకు సాగు నీరు ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నాయకులు శుక్రవారం కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్లో డిమాండ్ చేశారు. సాగు నీరు విడుదల చేయాలని కోరుతూ జాతీయ రహదారిపై మాజీ మంత్రి కొలుసు పార్థ సారధి, రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షుడు రామచంద్రరావు, రైతు విభాగం జిల్లా నాయకుడు కొల్లి రాజశేఖర్, మహిళా నాయకురాలు జ్ఞానమణిలు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. అనంతరం కృష్ణా - ఏలూరు కాల్వను పరిశీలించారు.