తెనాలి: పట్టిసీమ పేరుతో కృష్ణా డెల్టాను నాశనం చేయవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నాగిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ప్రథమ వినియోగ హక్కు, నికర జలాల హక్కు కలిగిన కృష్ణాడెల్టాకు పట్టిసీమ పేరుతో నీటి కేటాయింపులపై అయోమయ పరిస్థితిని కల్పించవద్దన్నారు.
చిత్తశుద్ధి ఉంటే కృష్ణాబోర్డు నుంచి ఏమేరకు నీటిని తీసుకుంటారో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. వేమూరు నియోజకవర్గంలో సాగునీరు అందక దెబ్బతిన్న వరిసాగు పొలాలను నాగిరెడ్డి పరిశీలించారు. రెండేళ్ల టీడీపీ పాలనలో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 43 లక్షల హెక్టార్ల నుంచి 40.9 లక్షల హెక్టార్లకు పడిపోయిందన్నారు.