కర్నూలు : శ్రీశైలం జలాశయం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు నీటి విడుదల బుధవారం ఉదయం ప్రారంభమైంది. తాగునీటి అవసరాల కోసం రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున పది రోజుల పాటు విడుదల చేయాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. దీంతో బుధవారం ఉదయం 7.30 గంటలకు నీటి విడుదల ప్రారంభించారు. కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో రెండు జనరేటర్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.