కరీంనగర్ (సుల్తానాబాద్): పంటకు నీళ్లందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా ఉందని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు విజయరామారావు బుధవారం ఆరోపించారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో బుధవారం పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీ86 కెనాల్‌కు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.