Vijayaramarao
-
నా కొడుకు నిర్దోషి: విజయరామారావు
హైదరాబాద్: కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తన కుమారుడు శ్రీనివాస్‌పై కేసులు నమోదు చేశారని సీబీఐ మాజీ డైరెక్టర్ కె.విజయరామారావు అన్నారు. త్వరలోనే తన కుమారుడి నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటానని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. కేసు నమోదు చేసినే విషయం వాస్తవమే అని, అయితే ఈ కేసుకు శ్రీనివాస్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకంగా పేర్కొన్న విజయరామారావు.. నిజానిజాలను కోర్టులో ఆధారాలతో సహా నిరూపిస్తానన్నారు. ఇప్పటి వరకు తాను ఈ విషయంలో సీబీఐని సంప్రదించలేదని కేవలం ప్రొసీడింగ్స్ మాత్రం చూశానని ఆయన వెల్లడించారు. తప్పుడు పత్రాలతో బ్యాంకును మోసం చేసి రూ.304 కోట్ల రుణం పొందారన్న ఆరోపణలపై బెంగళూరులోని సీబీఐ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం శ్రీనివాస్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
సీబీఐ మాజీ చీఫ్ కేవీఆర్ కుమారుడిపై సీబీఐ కేసు
తప్పుడు పత్రాలతో రుణం సీబీఐకి బ్యాంకు అధికారుల ఫిర్యాదు సాక్షి, హైదరాబాద్: సీబీఐ మాజీ డెరైక్టర్ కె.విజయరామారావు కుమారుడు శ్రీనివాస్ కళ్యాణ్‌రావుపై సీబీఐ కేసు నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో బ్యాంకు ను మోసం చేసి రూ.304 కోట్ల రుణం పొందారన్న ఆరోపణలపై బెంగళూరులోని సీబీఐ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం ఈ కేసు నమోదు చేసి శ్రీనివాస్ కార్యాలయంతోపాటు చెన్నై, హైదరాబాద్‌లోని ఆయన నివాసాలపై దాడులు నిర్వహించింది. శనివా రం రాత్రి జరిపిన ఈ సోదాల్లో అధికారులు పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై కేంద్రంగా శ్రీనివాస్ తమిళనాడు బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజనీరింగ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థకు ఎండీగా ఉన్నారు. సంస్థ పేరుతో కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.120 కోట్లు, సెంట్రల్ బ్యాంకు నుంచి రూ.124 కోట్లు, ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.60 కోట్లు రుణం తీసుకున్నారు. యంత్రాలతోపాటు వివిధ పరికరాలు కొనుగోలు కోసం ఈ రుణం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తప్పుడు బిల్లులు సమర్పించారని, ఈ విషయం అంతర్గత ఆడిటింగ్‌లో తేలిందని బ్యాంకు అధికారులకు సీబీఐకి ఫిర్యాదు చేశారు. దీంతో రం గంలోకి దిగిన సీబీఐ ఆర్థిక నేరాల దర్యాప్తు విభాగం అధికారులు ఐపీసీలోని 120(బీ) నేర పూరిత కుట్ర, 420 (మోసం), 471 (మోసం చేయాలనే ఉద్దేశంతో ఫోర్జరీ పత్రాలు సృష్టించడం), 471 (తప్పుడు పత్రాలను నిజమైనవిగా నమ్మించడం) తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన విజయరామారావు 1993 నుంచి 1996 వరకు సీబీఐ డెరైక్టర్‌గా విధులు నిర్వహిం చారు. ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని, దర్యా ప్తు ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. -
కేసీఆర్‌కు అమ్ముడుపోయే చరిత్రా ఉంది
-
కేసీఆర్‌కు అమ్ముడుపోయే చరిత్రా ఉంది
హైదరాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన శనివారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. కేసీఆర్ సంతలో పశువులను కొన్నట్లు రాజకీయ నేతలను కొంటున్నారని మండిపడ్డారు. మంత్రుల పేషీలు బ్రోకర్ కార్యలయాలుగా తయారయ్యాయని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు కొనే చరిత్రతో పాటు, అమ్ముడుపోయే చరిత్ర కూడా ఉందన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ బుద్ధి తెచ్చుకొని వ్యవహరించాలని ఎర్రబెల్లి హితవు పలికారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ...వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ అభ్యర్థులను కేసీఆర్ కొనుగోలు చేశారని ఎర్రబెల్లి ఆరోపించారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నవి కావని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. 16 నెలలుగా టీఆర్ఎస్ సర్కార్ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని, జీహెచ్ఎంసీ ఎన్నికల కోసమే ఇప్పుడు హడావిడి చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పథకాలు కలలుగానే మిగిలిపోతున్నాయని, ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని ఎర్రబెల్లి తెలిపారు. కాగా రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో పోటీ పెడుతున్నామన్నారు. విజయరామారావు పార్టీలోనే ఉంటారని ఆయన అన్నారు. -
విజయరామారావుకు చంద్రబాబు ఫోన్ కాల్
హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ నుంచి వరుసబెట్టి సీనియర్ నేతలంతా పార్టీని వీడుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగింపులు చేపట్టారు. టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి విజయరామారావుకు ఆయన శనివారం ఫోన్ చేశారు. పార్టీ మారడంపై తొందరపడవద్దని చంద్రబాబు ఈ సందర్భంగా ఆయనకు సూచించారు. అయితే ఆలోచించి తన నిర్ణయం చెబుతానని విజయరామారావు చెప్పినట్లు సమాచారం. మరోవైపు తెలంగాణ పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం విజయరామారావును ఆయన నివాసంలో కలవనున్నారు. కాగా ఇటీవలే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న గులాబీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు ఐదుగురు ఎమ్మెల్యేలు ఇదే తరహాలో పార్టీ మారారు. పార్టీలో ముఖ్య నేతగా పేరున్న మాజీ మంత్రి కె.విజయరామారావు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పడంతో తెలంగాణ టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. -
'నీళ్లు విడుదల చేయాలి'
కరీంనగర్ (సుల్తానాబాద్): పంటకు నీళ్లందించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా ఉందని తెలుగుదేశం పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు విజయరామారావు బుధవారం ఆరోపించారు. కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో బుధవారం పార్టీ కార్యకర్తలు నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీ86 కెనాల్‌కు నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. -
కాంగ్రెస్‌లో చేరిన విజయరామారావు, రఘునందన్
న్యూఢిల్లీ: టిఆర్ఎస్కు రాజీనామా చేసిన గుండె విజయరామారావు, ఎ.చంద్రశేఖర్, ఆ పార్టీ నుంచి సస్పెండయిన రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ సమక్షంలో వారు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్నారు. దిగ్విజయ్ సింగ్ వారి భుజాలపై పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్కు రాజీనామ చేసిన రోజునే చంద్రశేఖర్, విజయరామారావులు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురితోపాటు మెదక్ ఎంపి విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారని చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. విజయశాంతి ఓ పక్క ఏఐసిసి అధ్యక్షురాలుతోపాటు ఆ పార్టీ సీనియర్ నేతలను కలుస్తూనే ఉన్నారు. ఈ రోజు కూడా ఆమె వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్‌లను కలిశారు. ఈ నేపధ్యంలో ముందుగా వీరు ముగ్గురూ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
'కేసీఆర్ తీరుతో ఉద్యమానికి విఘాతం'
-
'కేసీఆర్ తీరుతో ఉద్యమానికి విఘాతం'
పార్టీ ప్రారంభమైననాటి నుంచి నిజాయితీగా పని చేసే సీనియర్లకు విలువనివ్వకుండా నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చినవారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీరుపై మాజీ మంత్రి విజయరామారావు మండిపడ్డారు. సీనియర్లను విస్మరించి కేసీఆర్ తన కుటుంబానికి పట్టం కడుతున్నారని ఆయన ఆరోపించారు. కేసీఆర్ వైఖరి ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయడంవల్లనే టీఆర్ఎస్ రాజీనామా చేశానని తెలిపారు. తెలంగాణ సాధించాలన్న లక్ష్యం నెరవేరినందున టీఆర్ఎస్లో ఉండాల్సిన అవసరలేదని భావించి రాజీనామా చేసినట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పాటే అన్నింటికంటే సంతృప్తి కలిగించే విషయమన్నారు. టీఆర్ఎస్లో డబ్బున్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు సీనియర్ నాయకులు సిద్ధమవుతున్నారని ఆయన చెప్పారు.