
'కేసీఆర్ తీరుతో ఉద్యమానికి విఘాతం'
పార్టీ ప్రారంభమైననాటి నుంచి నిజాయితీగా పని చేసే సీనియర్లకు విలువనివ్వకుండా నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చినవారికి ప్రాధాన్యతనిస్తున్నారంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తీరుపై మాజీ మంత్రి విజయరామారావు మండిపడ్డారు. సీనియర్లను విస్మరించి కేసీఆర్ తన కుటుంబానికి పట్టం కడుతున్నారని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ వైఖరి ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయడంవల్లనే టీఆర్ఎస్ రాజీనామా చేశానని తెలిపారు. తెలంగాణ సాధించాలన్న లక్ష్యం నెరవేరినందున టీఆర్ఎస్లో ఉండాల్సిన అవసరలేదని భావించి రాజీనామా చేసినట్టు తెలిపారు. తెలంగాణ ఏర్పాటే అన్నింటికంటే సంతృప్తి కలిగించే విషయమన్నారు. టీఆర్‌ఎస్‌లో డబ్బున్నవారికే ప్రాధాన్యత ఇస్తున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు సీనియర్ నాయకులు సిద్ధమవుతున్నారని ఆయన చెప్పారు.