
'కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలనడం దౌర్జన్యం'
హైదరాబాద్: నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేటాయింపులకు మించి ఇప్పటికే 50 టీఎంసీల నీటిని అధికంగా వాడుకుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. ఇంకా ఏపీ ప్రభుత్వం కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలని దౌర్జన్యం చేయడం సరికాదని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హితవు పలికారు. చంద్రబాబు తెలంగాణకు అన్యాయం చేయనంటూనే, విద్యుత్, పోలవరం ముంపు మండలాలు మొదలైన విషయాల్లో అన్యాయం చేశారని ఆరోపించారు. తెలంగాణపై ఆయనది కపటప్రేమ అని ఆయన అన్నారు. సమస్యలపై మాట్లాడుకుందామన్న చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించడం తగదని హితవు పలికారు. ఈ అంశంపై కృష్ణా వాటర్ బోర్డు జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.