డెల్టా.. ఉల్టా | Delta redesigned work | Sakshi
Sakshi News home page

డెల్టా.. ఉల్టా

Published Fri, Jan 9 2015 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 7:24 PM

డెల్టా ఆధునికీకరణ పనులు పల్టీలు కొడుతూనే ఉన్నారుు. దశా దిశా లేకపోవడంతో 2009 నుంచి పనులు పట్టాలెక్కడం లేదు.

ఏలూరు :డెల్టా ఆధునికీకరణ పనులు పల్టీలు కొడుతూనే ఉన్నారుు. దశా దిశా లేకపోవడంతో 2009 నుంచి పనులు పట్టాలెక్కడం లేదు. ఈ విషయంలో టీడీపీ సర్కారు సైతం మన్నుతిన్న పాములానే వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలోనూ అరకొరగానే పనులు చేపట్టేందుకు ప్రతిపాదించారు. రబీ సీజన్ ముగిశాక కాలువలు కట్టివేసే షార్ట్ క్లోజర్ పీరి యడ్‌లో ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు రూ.39 కోట్ల విలువైన పనులు చేపట్టేందుకు ఇరిగేషన్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఈసారి ఎక్కువ రోజులు కాలువలు కట్టివేసి (లాంగ్ క్లోజర్ పాటించి) పెద్దఎత్తున పనులు చేయూలని నీటి పారుదల శాఖ అధికారులు భావించారు. రైతులు కూడా ఇదే ఆశతో ఉన్నారు. అరుుతే, సర్కారు ఇందుకు విరుద్ధంగా ముందుకు వెళుతోంది. డెల్టా ఆధునికీకరణ ప్రాజెక్ట్‌లో భాగంగా ఇంకా రూ.800 కోట్ల విలువైన పనులను చేపట్టాల్సి ఉండగా, కేవలం రూ.39 కోట్ల విలువైన పనులు మాత్రమే చేపట్టేందుకు నిర్ణరుుంచడాన్ని చూస్తే సర్కారు ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
 
 షార్ట్ క్లోజర్‌లో చేపట్టే పనులివే..
 అత్తిలి కెనాల్ పరిధిలో రూ.3 కోట్లు, గోస్తనీ-వేల్పూరు (జీ అండ్ వీ) కాలువ అభివృద్ధికి రూ.8.95 కోట్లు, కాకరపర్రు మెయిన్ కెనాల్ ఆదునికీకరణకు రూ.7 కోట్లు, ఉండి మెయిన్ కాలువ అభివృద్ధికి రూ.8.30 కోట్లు వెచ్చించాలని నిర్ణరుుంచారు. వీడబ్ల్యు కెనాల్ ఆదునికీకరణకు రూ.4 కోట్లు, నరసాపురం మెయిన్ కెనాల్ అభివృద్ధికి రూ.2.50 కోట్లు, బ్యాంక్ కెనాల్ అభివృద్ధికి రూ.50 లక్షలు, కాకరపర్రు డ్రెయిన్ ఆధునికీకరణకు రూ.3.50 కోట్లు, యనమదుర్రు డ్రెయిన్ అభివృద్ధికి రూ.1.25 కోట్లు వెచ్చించేందుకు నీటి పారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది. గతేడాది చేపట్టిన రూ.150 కోట్ల విలువైన పనుల్లో పూర్తికాని వాటినే ఇప్పుడు తిరిగి ప్రారంభిస్తున్నట్టు సమాచారం.
 
 పనుల పూర్తిపై మీనమేషాలు
 జిల్లాలో ప్రోగ్రెసివ్ కనస్ట్రక్షన్స్ లిమిటెడ్ చేపట్టిన రూ.130.30 కోట్ల విలువైన జీడబ్ల్యు, ఏలూరు, జంక్షన్ కాలువల ఆధునికీకరణ పనుల్లో 10 శాతం కూడా పూర్తి కాలేదు. రూ.134 కోట్లతో ఐవీఆర్‌సీఎల్ లిమిటెడ్ చేపట్టిన నరసాపురం కాలువ పనుల్లో 25 శాతం, రూ.111.65 కోట్లతో చేపట్టిన యనమదుర్రు డ్రెయిన్ ఆధునికీకరణ పనుల్లో 30 శాతం మాత్రమే పూర్తయ్యూరుు. ఈ పరిస్థితుల్లో మొత్తం మీద రూ.300 కోట్ల విలువైన పనులను రద్దు చేయాలని ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పించారు.
 
 నిపుణుల కమిటీ నివేదికపై స్పందించని సర్కారు
 ఆధునికీకరణ పనుల్లో లోపాలను పరిశీలించి సల హాలు ఇచ్చేందుకు రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ చెరుకూరు వీరయ్య ఆధ్వర్యంలో నీటి పారుదల శాఖ నిపుణుల బృందం కొద్దినెలల క్రితం డెల్టాలో పర్యటిం చింది. పనులను చిన్నచిన్న ప్యాకేజీలుగా విభజించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీనిపై మంత్రివర్గ ఉపసంఘం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో దాదాపు రూ.800 కోట్ల విలువైన పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. 2009 నుంచి నానుతూ వస్తున్న డెల్టా ఆధునికీకరణ పనులను వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా పూర్తి చేసేందుకు సర్కారు సమగ్ర ప్రణాళిక ప్రకటించాలని ఇంజినీరింగ్ నిపుణులు సూచిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement