బీజింగ్: కరోనా కోరల నుంచి బయటపడిన ప్రపంచంపై మరోసారి వైరస్ పంజా విసురుతుందని ప్రముఖ ఎపిడెమియాలజిస్ట్ ఎరిక్ ఫీగ్ డింగ్ హెచ్చరించారు. రానున్న రోజుల్లో ఊహించని విధంగా కరోనా కేసులు పెరుగుతాయని, లక్షల్లో మరణాలు సంభవిస్తాయని అంచనా వేశారు. ప్రపంచానికి మరో ముప్పు పొంచి ఉందని పేర్కొన్నారు.
చైనాలో కరోనా ఆంక్షలు ఇటీవలే ఎత్తివేశారు. దీంతో గతంలో ఎన్నడు లేని విధంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. అక్కడ రోజులు కాదు గంటల్లోనే వైరస్ బాధితులు రెట్టింపు అవుతున్నారు. ఆస్ప్రత్రులు రోగులతో కిక్కిరిసిపోతున్నాయి.
ఈ నేపథ్యంలోనే వచ్చే 90 రోజుల్లో కరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే చైనాలో అత్యధికంగా 60 శాతం మందికి వైరస్ సోకే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా ప్రపంచ దేశాల్లో 10 శాతం మంది వైరస్ బారిన పడవచ్చని చెబుతున్నారు. కొత్త సంవత్సరం సమయానికి చైనాలో మరో కరోనా వేవ్ వస్తుందని, వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి కరోనా మూడో వేవ్ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయన్నారు.
చదవండి: మునిగిన యుద్ధ నౌక.. 31 మంది గల్లంతు..
Comments
Please login to add a commentAdd a comment