కొత్త వైరస్‌లు మానవాళికి సవాల్లు విసురుతున్నాయి. ఇప్పటికే కరోనా, దాని కొత్త వేరియంట్లతో ప్రపంచవ్యాప‍్తంగా ఆందోళన చెందుతున్న ప్రజలను మంకీ ఫాక్స్, మ్యాంగో ఫీవర్, టమాటో వ్యాధులు మరింత టెన్షన్ పెడుతున్నాయి.
తాజాగా కాంగో ఫీవర్ కేసులు పెరగడం వైద్యులను ఆందోళనకు గురిచేస్తోంది. జంతువుల నుంచి మనుషులకు సోకే కాంగో ఫీవర్ ఇరాక్‌లో కలకలం రేపుతోంది. కొత్త వైరస్ వ్యాప్తితో ఆ దేశ ప్రజలు వణికిపోతున్నారు. కాగా, ఈ ఏడాదిలో ఇప్పటికే 19 మంది మృత్యువాత పడ్డట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. శరవేగంగా వ్యాపించడం, అంతర్గత, బహిర్గత రక్తస్రావానికి(ముక్కు నుంచి రక్తం కారడం) దారి తీయడం, విపరీతమైన జ్వరం దీని ముఖ్య లక్షణాలు. దీని బారిన పడ్డ ప్రతీ ఐదుగురిలో ఇద్దరి చొప్పున మరణిస్తున్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ వైరస్ తొలిసారిగా మొట్టమొదట 1944లో క్రిమియాలో కనుగొనబడింది. ఈ తర్వాత 1979లో ఇరాక్‌లోనే వెలుగు చూసింది.
ఆఫ్రికా, ఆసియా, మధ్యతూర్పు ప్రాంతాల్లో ఎక్కువగానే కనిపించే కాంగో ఫీవర్ వైరస్ ఇరాక్ ప్రజలను అల్లకల్లోలం చేస్తోంది. ఇక, ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తుంది. అయితే, ఈ వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడం మరింత టెన్షన్ పెడుతోంది. కాగా, కాంగో హెమోరేజిక్ అనే పేను ద్వారా జంతువుల్లో ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుంది. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల్లో ఈ వైరస్ వాహకంగా ఈ పేలు పనిచేస్తుంది. వైరస్ బారిన పడిన పశువుల రక్తాన్ని తాకినప్పుడు, పశువధ కేంద్రాల్లోని పదార్థాల ద్వారా మనుషులకు ఈ వైరస్ సోకుతుంది.
ఇది కూడా చదవండి: విమాన ప్రయాణం విషాదాంతం
Comments
Please login to add a commentAdd a comment