somaji guda press club
-
ఎంఐఎంతో పొత్తుపై కేటీఆర్ క్లారిటీ
సాక్షి, హైదరాబాద్ : దశాబ్దాల పాటు వెనకబాటుతనానికి గురైన తెలంగాణ రాష్ట్రంలో ఆరేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టిందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హైదరాబాద్‌లో అనిశ్చితి ఉండేదని, తాము అధికారంలోకి వచ్చాక ఎంతో మార్పు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడితే అల్లర్లు జరుగుతాయని విష ప్రచారం చేశారని, ఇప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉందంటే కేసీఆరే కారణంమని పేర్కొన్నారు. గతంలో టీఆర్ఎస్పై విపరీతమైన దుష్ప్రచారం చేసినవారంతా నేడు కనుమరుగైయ్యారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ఎక్కడా గిల్లికజ్జాలకు పోకుండా అభివృద్ధిపైనే దృష్టి పెట్టారని వివరించారు. టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్‌లో పటిష్ట శాంతిభద్రతలున్నాయని చెప్పారు. దేశంలో ఉన్న సీసీ కెమెరాల్లో 65శాతం హైదరాబాద్‌లోనే ఉన్నాయన్నారు. భాగ్యనగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఉగాదికి ప్రారంభిస్తామని తెలిపారు. (టీఆర్ఎస్కు చెక్.. కాషాయ వ్యూహం) ఒంటరిగా 150 స్థానాల్లో పోటీ గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్ని వివిధ అంశాలపై మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేటీఆర్ స్పందిస్తూ.. మరోసారి గ్రేటర్ మేయర్ పీఠం తమదేన్నారు. ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరిగా 150 స్థానాల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు. మిత్రపక్షం ఎంఐఎంతోనూ పొత్తు ఉండదని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో 5చోట్ల ఎంఐఎంను ఓడించామని, ఈసారి 10చోట్లకుపైగా ఎంఐఎంను ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక ఎన్నికల ఫలితం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపదన్నారు. గతంలో వచ్చిన ఫలితాలనే బీజేపీ మరోసారి ఎదుర్కొంటుందని జోస్యం చెప్పారు. ప్రథమ స్థానంలో హైదరాబాద్ ‘రూ.2వేల కోట్లతో శివారు ప్రాంతాలకు తాగునీరు అందించాం. 1920లో గండిపేట కడితే, 2020లో కేశవాపూర్ రిజర్వాయర్ కడుతున్నాం. 90శాతం తాగునీటి సమస్యను పరిష్కరించాం. తెలంగాణ ఏర్పడినప్పుడు విద్యుత్ కొరత ఉండేది. ఏడు మండలాలు, సీలేరు విద్యుత్ ప్లాంట్‌ను కేంద్రం ఏపీలో కలిపింది. కేసీఆర్ ముందుచూపుతో విద్యుత్‌లోటు నుంచి మిగులు విద్యుత్‌కు చేరుకున్నాం. ఇప్పుడు లక్షలాది మంది కార్మికులకు తగినంత పని దొరుకుతుంది. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తర్వాత చెత్త సేకరణ పెరిగింది. 6,500 మెట్రిక్ టన్నుల చెత్తను సేకరిస్తున్నాం. 40 లక్షల జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ప్రథమస్థానంలో ఉంది. మరో రెండు డంపింగ్ యార్డ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తయ్యే ప్లాంట్ ప్రారంభించాం. నిర్మాణరంగ వ్యవర్థాలతో తయ్యారయ్యే టైల్స్ ప్లాంట్‌ను ప్రారంభించాం. చివరిదశలో లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నగరంలో పేకాట క్లబ్బులు, గుడుంబా గబ్బు లేదు. బాంబు పేలుళ్లు, మతకలహాలు, పోకిరీల పోకడలు లేవు. ఎస్ఆర్డీపీ కింద ఫ్లైఓనర్లు నిర్మించాం. 137 లింక్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. టీఎస్ఐపాస్తో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. టాప్-5 కంపెనీల్లో నాలుగు ఈ ఆరేళ్లలోనే వచ్చాయి. టీఎస్ఐపాస్తో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. టాప్-5 కంపెనీల్లో నాలుగు ఈ ఆరేళ్లలోనే వచ్చాయి. మహేశ్వరం, రావిర్యాలలో కొత్త కంపెనీలు రాబోతున్నాయి. రోజుకు 50వేల మందికి రూ.5కే నాణ్యమైన భోజనం. లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు చివరిదశలో ఉన్నాయి. దసరాకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇద్దామనుకున్నాం. కరోనా వల్ల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు ఆలస్యమైంది’ అని అన్నారు. -
హిందూ ధర్మానికి రక్షణ కొరవడింది: స్వామీ పరిపూర్ణానంద
హైదరాబాద్, న్యూస్‌లైన్: హిందువులు పీఠాధిపతులకు కేవలం దండం పెట్టుకోవడమే కాకుండా ఒక సైనికుడిలా మారి ధర్మాన్ని కాపాడాలని శ్రీపీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద పిలుపునిచ్చారు. ప్రభుత్వం నుంచి హిందూ ధర్మానికి రక్షణ కొరవడిందని ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఇక్కడి సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కంచి పీఠానికి అధిపతులుగా ఉన్న వారిపై అకారణంగా కేసులు బనాయించి వారిని మానసిక వేదనకు గురిచేశారన్నారు. ఈ కేసులో న్యాయస్థానం పూర్తి పారదర్శకంగా వ్యవహరించిందని చెప్పారు. పీఠానికి తిరిగి గౌరవం దక్కే విధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక రూపొందించాలని కోరారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదన్నారు. -
17 నుంచి బేస్‌బాల్ ప్రీమియర్ లీగ్
పంజగుట్ట, న్యూస్‌లైన్: వరుసగా రెండో ఏడాది బేస్‌బాల్ ప్రీమియర్ లీగ్‌కు రంగం సిద్ధమైంది. గత ఏడాది విజయవంతంగా జరిగిన ఈ టోర్నీని ఈ నెల 17 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు టోర్నీ వివరాలు వెల్లడించారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి అథ్లెటిక్స్ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో ఆరు ఫ్రాంచైజీ జట్లు పాల్గొంటున్నాయి. భారత్, కొరియా, నేపాల్‌లకు చెందిన దాదాపు 100 మంది జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు. ప్రతీ రోజు మూడు సెషన్ల పాటు పోటీలు నిర్వహిస్తారు. ఈ టోర్నీకి ఎస్బీహెచ్ ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. గత ఏడాది ప్రీమియర్ లీగ్‌కు లభించిన ఆదరణను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది విదేశీ ఆటగాళ్లతో టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ సీవీ ప్రతాప్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ బేస్‌బాల్ సంఘం కార్యదర్శి ఎల్.రాజేందర్, సంయుక్త కార్యదర్శి అమిత్ గాడ్సే తదితరులు పాల్గొన్నారు. టోర్నీలో పాల్గొనే జట్లు 1. అపోలో రాకెట్స్, 2. మైలాన్ పైరేట్స్, 3. ఐబీఏ బెంగళూరు, 4. ప్రొ ఫిట్ స్మాషర్స్, 5. సీఈఏ జెయింట్స్, 6. యంగ్‌మెన్ క్లబ్స్ -
సెయిలింగ్ అసోసియేషన్‌కు గుర్తింపు ఉంది
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర సెయిలింగ్ అసోసియేషన్ (ఏపీఎస్ఏ) అనే సంస్థ లేదని ఏపీఓఏ ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ ఆరోపించడం సరికాదని ఏపీఎస్ఏ అధ్యక్షుడు గోపాలకృష్ణ విమర్శించారు. జాతీయ సెయిలింగ్ సమాఖ్య నుంచి ఏపీఎస్ఏకు గుర్తింపు ఉందని గుర్తుచేశారు. సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్ జిల్లా సెయిలింగ్ చాంపియన్‌షిప్, ఇంటర్ జోన్ సెయిలింగ్ పోటీలను 2006 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఆగస్టులో జరిగిన సెయిలింగ్ చాంపియన్‌షిప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగదీశ్వర్ యాదవే పాల్గొన్నారని, ఇప్పుడు ఆయనే రాష్ర్టంలో సెయిలింగ్ కార్యకలాపాలు జరగడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ (ఏపీఓఏ), రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్)నుంచి నిధులు ఆశించకపోవడం వల్లే తమను గుర్తించడం లేదని చెప్పారు. -
బడుగులకు అధికారంతోనే తెలంగాణ అభివృద్ధి: విమలక్క
‘మీట్ ది ప్రెస్’లో విమలక్క సాక్షి, హైదరాబాద్: బడుగు, బలహీన వర్గాలకు అధికారం వచ్చినప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ నెల 15న తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో జరిగే ప్రథమ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రేపటి నవ తెలంగాణకోసం అందరూ కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. సీమాంధ్ర పెట్టుబడిదారులు, కబ్జాదారులు ఆక్రమించుకున్న స్థలాలను దళితులకు అందించాల్సిన అవసరముందన్నారు. మైనారిటీ ప్రజలకు భద్రత కల్పిస్తూ వక్ఫ్ భూములను వారికి కేటాయించాలని కోరారు. తెలంగాణను అడ్డుకునేందుకు సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు సీమాంధ్ర ప్రజల్లో అభద్రత భావాలను, అనుమానాలను రేకెత్తిస్తూ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ తెలంగాణ బిడ్డల రక్తమాం సాలతో నిర్మితమైందని, దానిపై సీమాంధ్రులు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులు శాంతిర్యాలీలు చేస్తామంటే అనుమతించని ప్రభుత్వం తెలంగాణ ప్రజలపై యుద్ధానికి సిద్ధమైన సీమాంధ్ర ఉద్యోగులకు అనుమతి ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. సంఘం అధ్యక్షుడు కప్పర ప్రసాద్ మాట్లాడుతూ.. నవ తెలంగాణకోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. టీజేయూ నాయకులు శ్రీనివాసరావు, ఇస్మాయిల్, వెంకట్, మోహన్ బైరాగి, సుదర్శన్, అరుణ తదితరులు పాల్గొన్నారు.