ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర సెయిలింగ్ అసోసియేషన్ (ఏపీఎస్‌ఏ) అనే సంస్థ లేదని ఏపీఓఏ ప్రధాన కార్యదర్శి కె.జగదీశ్వర్ యాదవ్ ఆరోపించడం సరికాదని ఏపీఎస్‌ఏ అధ్యక్షుడు గోపాలకృష్ణ విమర్శించారు. జాతీయ సెయిలింగ్ సమాఖ్య నుంచి ఏపీఎస్‌ఏకు గుర్తింపు ఉందని గుర్తుచేశారు.
సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంతర్ జిల్లా సెయిలింగ్ చాంపియన్‌షిప్, ఇంటర్ జోన్ సెయిలింగ్ పోటీలను 2006 నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గత ఆగస్టులో జరిగిన సెయిలింగ్ చాంపియన్‌షిప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగదీశ్వర్ యాదవే పాల్గొన్నారని, ఇప్పుడు ఆయనే రాష్ర్టంలో సెయిలింగ్ కార్యకలాపాలు జరగడం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని గోపాలకృష్ణ పేర్కొన్నారు. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ (ఏపీఓఏ), రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ (శాప్)నుంచి నిధులు ఆశించకపోవడం వల్లే తమను గుర్తించడం లేదని చెప్పారు.
సెయిలింగ్ అసోసియేషన్‌కు గుర్తింపు ఉంది
Published Tue, Oct 8 2013 11:53 PM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement