
సాక్షి, కామారెడ్డి: తెలంగాణలో తమ పార్టీ మిషన్ 70కి కామారెడ్డితో బీజం పడటం ఖాయమని బీజేపీ నేత స్వామి పరిపూర్ణానంద అన్నారు. కామారెడ్డిలో గురువారం ఆయన మాట్లాడుతూ.. బీజేపీ వికసిస్తేనే తెలంగాణ వికసిస్తుందని వ్యాఖ్యానించారు. మైనార్టీల ఓట్లు సైతం బీజేపీకే వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తనను తెలంగాణ నుంచి బహిష్కరించినా పోరాటం ఆపనని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే డ్రైనేజ్‌లో వేసినట్టేనని విమర్శించారు. టీఆర్‌ఎస్‌కు, బీజేపీకి అంతర్గత ఒప్పందం లేదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment