
రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న బిజేపీ నాయకులు
తాండూరు: హైదరాబాద్ నుంచి యాదాద్రికి పాదయయాత్ర చేపడుతున్న స్వామి పరిపూర్ణానంద స్వామిని పోలీసులు గృహనిర్బంధం చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.రమేష్‌కుమార్ తెలిపారు. తాండూరులోని అంబేడ్కర్‌చౌక్‌లోని ప్రధాన రోడ్డుపై బీజేపీ నాయకులు సోమవారం బైఠాయించారు.
రాస్తారోకో చేశారు. వారు ఆందోలనకు దిగిన కొద్దిసేపటికే పోలీసులు చేరుకుని నాయకులను అడ్డుకున్నారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్ ఎదుట బైఠాయించారు.
ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామిజీ హిందూ ధర్మం కోసం పాటు పడుతున్న వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ పూజారి పాండు, పట్టణ అధ్యక్షుడు బంటారం భద్రేశ్వర్, నాయకులు బొప్పి సురేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment