house arrested
-
హైదరాబాద్ లో వైఎస్ షర్మిల హౌస్ అరెస్ట్
-
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నేతల గృహ నిర్బంధం
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌లకు మద్దతుగా ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, వీహెచ్, కోదండరెడ్డి, మల్లురవి సహా రాష్ట్రవ్యాప్తంగా ముఖ్య నేతలను సోమవారం ఉదయం నుంచే హౌస్ అరెస్ట్‌లు చేపట్టారు పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్నాకు అనుమతులు లేవని, ఎవరైనా బయటకువచ్చి నిరసనలు చేస్తే అరెస్టులు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. పంచాయతీలకు నిధుల అంశంపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నాకు పిలుపునిచ్చింది కాంగ్రెస్. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని, సర్పంచులందరినీ ఏకం చేయాలని నేతలకు సూచించింది. అయితే, ఈ ధర్నాలకు పోలీసులు అనుమతులు లేవని తెలపడం, గృహనిర్బంధం చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. అనుమతి ఇవ్వకపోయినా ధర్నా చేసి తీరుతామని టీకాంగ్రెస్ నేతలు అంటున్నారు. ధర్నాను అడ్డుకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: మైనార్టీలపై కాంగ్రెస్ ‘నజర్’ -
దళితులను నిర్బంధించి చిత్రహింసలు.. మహిళకు గర్భస్రావం!
చిక్కమగళూరు: కర్ణాటకలోని చిక్కమగళూరులో ఓ వ్యక్తి తన ప్లాంటేషన్‌లో దళితులను నిర్బంధించి, చిత్రహింసలకు గురిచేసిన ఘటన సంచలనం రేపుతోంది. జగదీశగౌడకు జెనుగడ్డె గ్రామం వద్ద కాఫీ ప్లాంటేషన్ ఉంది. ఇతడి నుంచి రోజువారీ కూలీలైన బాధితులు రూ.9 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ సొమ్మును తిరిగి చెల్లించలేకపోవడంతో మొత్తం 16 మందిని జగదీశ తన ప్లాంటేషన్‌లో నిర్బంధించాడు. జగదీశ గౌడ దెబ్బలతో ఒక మహిళకు గర్భస్రావం అయింది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిందితులు జగదీశ గౌడ, అతడి కుమారుడు తిలక్ కోసం గాలింపు చేపట్టారు. తమ బంధువులను జగదీశ గౌడ చిత్రహింసలు పెడుతున్నారంటూ కొందరు వ్యక్తులు ఈనెల 8వ తేదీన ఫిర్యాదు చేశారు. మరుసటి రోజే ఆ ఫిర్యాదును వారు వెనక్కి తీసుకున్నారని బలెహొన్నూర్ పోలీసులు చెప్పారు. ఆ మరునాడు బాధితురాలైన గర్భవతిని ఆస్పత్రిలో చేర్పించి, చిక్కమగళూరులో మరోసారి వీరు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో తాము వెళ్లి బందీలుగా ఉన్న నాలుగు కుటుంబాలకు చెందిన మొత్తం 16 మందిని విడిపించామన్నారు. వీరిని 15 రోజులుగా నిర్బంధంలోనే ఉంచినట్లు తేలిందన్నారు. వీరిలో రెండు నెలల గర్భవతి అయిన అర్పిత కూడా ఉంది. జగదీశ గౌడ ఈమె ఫోన్ లాగేసుకుని ఒక రోజు నిర్బంధించాడని, కొట్టడంతో గర్భస్రావం అయిందని ఆమె తల్లి ఆరోపించింది. జగదీశ గౌడ నుంచి అడ్వాన్స్ డబ్బులు తీసుకున్న వారు ఎటో వెళ్లిపోవడంతో అతడు తమను నిర్బంధించినట్లు బాధితులు తెలిపారని చిక్కమగళూరు ఎస్పీ ఉమా ప్రశాంత్ చెప్పారు. కాగా, జగదీశ గౌడ బీజేపీ నేత అంటూ వచ్చిన వార్తలను బీజేపీ ఖండించింది. జగదీశ గౌడతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ జిల్లా ప్రతినిధి వరసిద్ధి వేణుగోపాల్ తెలిపారు. ఇదీ చదవండి: షాకింగ్ వీడియో.. నిర్లక్ష్యంగా కారు డోరు తెరవటంతో ఘోర ప్రమాదం -
మెహబూబా ముఫ్తీ గృహ నిర్బంధం
శ్రీనగర్: పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీని మంగళవారం జమ్మూకశ్మీర్ అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. తన కదలికలపై ఆంక్షలు విధించడం ‘కశ్మీర్లో శాంతి నెలకొందంటూ అధికారులు చేస్తున్న ప్రచారం అబద్ధమని తేలిందని మెహబూబా పేర్కొన్నారు. ‘ఈ రోజు నన్ను అధికారులు గృహ నిర్బంధంలో ఉంచారు. అందుకు వారు చెబుతున్న కారణం..కశ్మీర్లో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవన్నది. ఇక్కడ శాంతి నెలకొన్నదంటూ అధికారులు చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని తేలిపోయింది’ అని మెహబూబా మంగళవారం ట్విట్టర్లో వ్యాఖ్యానించారు. అఫ్గానిస్తాన్‌లో పౌరుల హక్కులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం, కశ్మీరీలకు మాత్రం అలాంటి హక్కులు లేకుండా చేస్తోందని ఆరోపిస్తూ గుప్కార్లోని తన నివాసం ప్రధాన గేటు వద్ద భద్రతా బలగాల వాహనం ఉన్న ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు. అత్యంత సమస్యాత్మకంగా ఉన్న కుల్గాం జిల్లాలోని బంధువుల ఇంట్లో కార్యక్రమానికి వెళ్లాలని తెలపగా.. పాక్ అనుకూల వేర్పాటువాద నేత గిలానీ మరణానంతరం అక్కడ పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని మెహబూబాకు సర్ది చెప్పి, ఆపామని అధికారులు తెలిపారు. -
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి హౌస్ అరెస్ట్
-
జగిత్యాలలో ఉద్రిక్తత.. జీవన్‌రెడ్డి హౌస్ అరెస్ట్
సాక్షి, కరీంనగర్ : జగిత్యాల జిల్లాలో రైతుల ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది. మొక్కజొన్న, వరి దాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని ‘ఛలో’ కలెక్టరేట్ పేరుతో రైతులు చేపట్టిన మహార్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. 144 సెక్షన్ అమలు చేస్తూ ఎక్కడికక్కడ రాజకీయ పార్టీల నాయకులను గృహనిర్బంధం చేసి రైతులను ముందస్తు అరెస్టు చేశారు. అయితే రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో కొంతమంది రైతులు కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా చేపట్టారు. చదవండి: ‘కోవాక్సీన్’ బిహార్ కోసమేనట! పోలీసులు రైతు సంఘాల ప్రతినిధులను అరెస్ట్ చేసి డీసీఎం వ్యాన్‌లో తీసుకెళుతుండగా రైతులు అడ్డుకున్నారు. బ్యాంక్ అడ్డంగా రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కొందరు వ్యాన్‌పై రాళ్లు రువ్వడంతో వ్యాన్ అద్దాలు ద్వంసం అయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు, రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో భారీగా పోలీసులు మోహరించారు. జగిత్యాలలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. చదవండి: కార్మిక నేతకు తుది వీడ్కోలు -
ఆర్టికల్ 370 రద్దు : ఏడాదికి విముక్తి
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు అనంతరం చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలువురు నేతలపై గృహ నిర్బంధం విధించిన విషయం తెలిసిందే. రానున్న ఆగస్ట్ 5తో ఆర్టికల్ 370ను రద్దు చేసి తొలి ఏడా పూర్తి చేసుకుంటున్న సందర్భంగా పలువురు నేతలను విడుదల చేస్తున్నారు. దీనిలో భాగంగానే పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత, మాజీమంత్రి సజ్జద్ లోనేను శుక్రవారం గృహ నిర్బంధం నుంచి విముక్తి కల్పించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్ వేదికగా వెల్లడించారు. తన రాజకీయ జీవితంలో నిర్బంధం (జైలు) అనేది కొత్తేమీ కాదని, ఎన్నో కొత్త విషయాలను తెలుసున్నాని తెలిపారు. (ఒమర్ అబ్దుల్లా కీలక నిర్ణయం) గత ఏడాది ఆగస్ట్‌లో సజ్జద్‌ను పోలీసుల కస్టడీలోకి తీసుకుగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. కాగా కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లాలను ఇదివరకే విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే పీడీపీ అధ్యక్షురాలు సయ్యద్ ముఫ్తీ మహ్మద్‌ను మాత్రం ఇంకా నిర్బంధంలోనే ఉంచారు. ఆమెతో పాటు మరికొంతమంది కశ్మీర్ నేతలపై నిర్బంధం ఇంకా కొనసాగుతోంది. మరోవైపు కశ్మీర్ విభజనకు తొలి ఏడాది పూర్తి కావస్తున్న తరుణంలో ఈ ఏడాది కాలంలో చోటుచుకున్న అభివృద్ధిపై నివేదికను వెలువరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే దీనిపై ఏర్పాట్లును పూర్తి చేసింది. -
‘వారి విడుదల కోసం ప్రార్థిస్తున్నా’
సాక్షి, న్యూఢిల్లీ : నిర్బంధంలో ఉన్న ముగ్గురు జమ్ము కశ్మీర్ మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీల విడుదల కోసం ప్రార్ధిస్తున్నానని, కశ్మీర్లో సాధారణ పరిస్థితి నెలకొనేందుకు వారు సహకరిస్తారని ఆశిస్తున్నానని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఏడాది ఆగస్ట్ 5న జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను అందించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో మాజీ సీఎంలు సహా పలువురు రాజకీయ నేతలను కశ్మీర్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి పలువురు నేతలను విడుదల చేసినా ముగ్గురు మాజీ సీఎంలు మాత్రం నిర్బంధంలో కొనసాగతున్నారు. ఫరూక్ అబ్దుల్లాను అత్యంత కఠినతర ప్రజాభద్రత చట్టం (పీఎస్ఏ) కింద అరెస్ట్ చేయగా ఒమర్, మెహబూబాలను అదే చట్టం కింద నిర్బంధంలో ఉంచారు. ఇక కశ్మీర్లో పరిస్ధితి ప్రశాంతంగా ఉందని, పరిస్థితి వేగంగా మెరుగవుతోందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పుకొస్తూ వీరి (నిర్బంధంలో ఉన్న రాజకీయనేతల విడుదల) పై కూడా ఓ నిర్ణయం ఖరారు చేయాల్సి ఉందని, ప్రభుత్వం ఏ ఒక్కరినీ వేధించదని స్పష్టం చేశారు. కశ్మీర్ పురోగతి కోసం తీసుకున్న నిర్ణయాలను ప్రతి ఒక్కరూ స్వాగతించాలని అన్నారు. చదవండి : మనది మతరాజ్యం కాదు -
భరోసా ఇచ్చినా.. తొలగని భయం!
భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో రెండు రోజులుగా పరిస్థితి మెరుగు పడింది. ఆదివారం జరిగిన అల్లరి మూకల దాడుల తర్వాత వదంతుల వ్యాప్తి ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది. పోలీసులు భరోసా ఇచ్చినా.. వదంతులతో భయాందోళనకు గురవుతున్నారు. అల్లర్ల ఘటనకు కారకులైన 55 మందిని అరెస్టు చేసినట్లు సీఐ వేణుగోపాల్‌రావు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారం చేసుకోవచ్చని చెబుతున్నప్పటికీ స్థానికంగా ఆ సందడి కనిపించడంలేదు. మరో రెండు రోజుల్లో ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించనున్నామని, ఎన్నికలయ్యే వరకూ భైంసాలో అదనపు బలగాలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. 240 మంది ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, 150 మంది స్పెషల్ పోలీసులు, ఏఆర్, సివిల్ కానిస్టేబుళ్లు ప్రత్యేక బలగాలతో కలిపి 900 మంది బందోబస్తులో ఉన్నారు. ప్రతిరోజు భైంసాలో కవాతు నిర్వహిస్తున్నారు. కరీంనగర్, వరంగల్ ఐజీలు నాగిరెడ్డి, ప్రమోద్‌కుమార్ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతాయని భరోసా ఇస్తున్నారు. కర్ఫ్యూ, 144 సెక్షన్ ఎత్తివేసినప్పటికీ దుకాణాలు మాత్రం తెరుచుకోవడంలేదు. చాలా మంది తమ బంధువుల ఇళ్లకు వెళ్లిపోతున్నారు. దీంతో ఈనెల 22న జరిగే పోలింగ్‌పై ఈ ప్రభావం పడనుందని పరిశీలకులు చెబుతున్నారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే గృహ నిర్బంధం సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్): బీజేపీ మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణను పోలీసులు గురువారం రాత్రి నిజామాబాద్‌లో హౌజ్ అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఘటనపై సమీక్షించేందుకు వెళ్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. -
చింతమనేని అనుచరులు తీవ్ర పదజాలంతో దూషించారు
-
అంబర్‌పేటలో మందకృష్ణ మాదిగ హౌజ్ అరెస్ట్
-
చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్సీపీ నాయకుల నిర్భందం
-
గృహనిర్బంధంలో వరవరరావు
హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు గృహనిర్బంధంలోనే గడిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయనను గురువారం పుణే పోలీసులు తిరిగి గాంధీనగర్‌లోని తన స్వగృహానికి తరలించారు. సెప్టెంబర్ 5 వరకు గృహనిర్బంధం చేసిన దరిమిలా ఆయన నివాసం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి 11.30 గంటల విమానంలో పుణే నుంచి వరవరరావు బయలుదేరాల్సి ఉండగా దాన్ని సకాలంలో అందుకోలేకపోవడంతో తెల్లవారుజామున 2.30 గంటల విమానంలో పోలీసులు ఆయనను హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ..పోలీసులు తనపై అక్రమ కేసులు బనాయించారని, దీనిపై కోర్టు ద్వారా న్యాయపోరాటం చేస్తానని చెప్పారు. అనంతరం వరవరరావును అక్కడ్నుంచి గురువారం ఉదయం 6.30కు పోలీసు బందోబస్తు మధ్య ఆయన నివాసానికి తరలించారు. ఈ సందర్భంగా సతీమణి హేమలత, కుటుంబ సభ్యులు ఆయనను ఆలింగనం చేసుకొని కన్నీటిపర్యంతమయ్యారు. ఇద్దరు పుణే పోలీసులు ఇంట్లో కాపలా ఉండగా, తెలంగాణ పోలీసులు ఇంటి బయట, అపార్ట్మెంట్ ప్రధాన ద్వారం వద్ద కాపలా ఉన్నారు. వరవరరావును కలిసేందుకు ఆయన మేనల్లుడు ఎన్.వేణుగోపాల్, వనజ, కూతుళ్లు సహజ, అనల, పవన, అల్లుళ్లు ప్రొఫెసర్ సత్యనారాయణ, కూర్మనాథ్, మనుమలు, మనుమరాళ్లు తదితర కుటుంబ సభ్యులతో పాటుగా న్యాయవాదులు రవీంద్రనాథ్, సురేశ్‌ను మాత్రమే పోలీసులు అనుమతించారు. ప్రజాసంఘాల నిరసన వరవరరావును కలిసేందుకు గాంధీనగర్‌లోని హిమసాయి అపార్ట్‌మెంట్‌కు ఐజేయూ సెక్రెటరీ జనరల్ దేవులపల్లి అమర్, వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు, న్యూడెమోక్రసీ నాయకులు అక్కడికి తరలి రాగా వారిని పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు అక్కడే నిరసన వ్యక్తం చేశారు. మరోవైపు అక్కడకు చేరుకున్న మీడియాను సైతం పోలీసులు అనుమతించలేదు. సెప్టెంబర్ 5 వరకు వరవరరావు ఇంటి వద్ద ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముంది. అరెస్టు అప్రజాస్వామికం: హరగోపాల్ వరవరరావు అరెస్టు అప్రజాస్వామికమని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. గురువారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పౌరులు స్వేచ్ఛగా జీవించే వాతావరణాన్ని ప్రభుత్వాలు కల్పించకుండా హక్కులు అడిగిన ప్రజాస్వామిక వాదుల గొంతులు నొక్కడం సరైంది కాదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మతోన్మాద శక్తుల ఆగడాలకు అడ్డులేకుండా పోయిందన్నారు. దేశంలోని రచయితలు, జర్నలిస్ట్‌లు, కవులు, కళాకారులు, దళితులు, మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో తెలంగాణ పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు రఘునాథ్ టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమాస కృష్ణ, పీఓడబ్ల్యూ సంధ్య, ఉ.సాంబశివరావు, లింగయ్య, పీఎం.రాజు తదితరులు పాల్గొన్నారు. -
‘మైనింగ్‌లో చంద్రబాబు, లోకేశ్‌కు వాటాలు’
సాక్షి, గుంటూరు : గురజాలలో పోలీసులు భయందోళనలు సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు హౌస్ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ దాచేపల్లి, పిడుగురాళ్ల పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో సోమవారం వారిని హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురజాలలో నాలుగేళ్లుగా టీడీపీ నేతలు అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారని ఆరోపించారు. యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగుతోందని, అన్యాయాలు బయటకు వస్తాయని శ్రీనివాసరావు బయపడుతున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితమే టీడీపీ ర్యాలీకి అనుమతిని ఇచ్చిన పోలీసులు, వైఎస్సార్సీపీ పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. చట్టబద్ధంగా అనుమతి కోరితే తిరస్కరించారని, పోలీసులు అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2009లో చనిపోయిన రైతుపై అక్రమ మైనింగ్ కేసు పెట్టారని, అమాయక ప్రజలపై కేసులు పెట్టి టీడీపీ నేతలు తప్పించుకుంటున్నారని మహేష్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు, లోక్‌శ్‌కు వాటా అక్రమ మైనింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కి వాటా ఉందని, నిజాలను ఎవరు అణచివేయలేరని నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆరోపించారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరగుతోందని, మైనింగ్‌లో చంద్రబాబుకు వాటా ఉన్నందునే ఆయన బయపడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు పర్యటిస్తే వారి బండారం బయటడుతుందని తమ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఒక కూలీ 40 కోట్ల దోచుకున్నారంటే ఎవరు నమ్మలేరని అన్నారు. గతంలో కోడెల కుమారుడు నడిరోడ్డుపై సభ పెడితే అనుమతించారని, చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే తమకు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆసుపత్రిపై ఆంక్షలు ఎమ్మెల్యే గోపిరెడ్డికి చెందిన ఆసుపత్రిని కూడా పోలీసులు నిర్భందించారు. పోలీసుల ఆంక్షలతో ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.. యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరగుతోందని, టీడీపీ నేతలు ప్రభుత్వ ఖజనాకు గండికొడుతున్నారని ఆయన విమర్శించారు. దీనిపై పలుమార్లు ధర్నా కూడా నిర్వహించినట్లు ఆయన గుర్తుచేశారు. నిజనిర్ధారణ కమిటీ పరిశీలిస్తే ఇలా అక్రమాలు బయటకు వస్తాయని తెలిపారు. -
గురజాలలో పోలీసుల రాజ్యం
సాక్షి, గుంటూరు : గురజాల నియోజకవర్గంలో పోలీసులు అక్రమ అరెస్ట్‌లతో వైఎస్సార్సీపీ నేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నేడు పిడుగురాళ్ల, దాచేపల్లిలోని అక్రమ మైనింగ్ క్యారింగ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి, పార్టీనేత కాసు మహేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురజాల నియోజకవర్గాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇళ్లనుంచి బయటకు వచ్చిన అనేక మంది కార్యకర్తలను, పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేతలేవరు బయటకు రాకుండా దాచేపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. కమిటీ పర్యటిస్తే అక్రమ మైనింగ్‌పై నిజాలు బయటకొస్తాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తమ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నియోజవర్గంలో పోలీసులు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు తొత్తులుగా మారారు. మూడు రోజుల క్రితం టీడీపీ ర్యాలీకి అనుమతించిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతల పర్యటనను మాత్రం అడ్డుకుంటున్నారు. పర్యటన రద్దు చేసుకోకపోతే కేసులు పెడతామని హెచ్చరించిన పోలీసులు ముందుగానే వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు పంపించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో హైకోర్టును తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్టు కనబడుతోంది. పల్నాడులో 28 లక్షల టన్నుల తెల్లరాయిని దోచుకున్నట్లు ఇటీవల నిర్ధారణ కమిటీ తేల్చిన విషయం తెలిసిందే. తనపై కేసులు రాకుండా టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని పన్నాగం కుట్రలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతలు అక్రమంగా కోట్లు దోచుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకులకు దోపిడీలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎట్టకేలకు పెళ్లికి ఒప్పుకున్న మోడల్
భోపాల్ : దాదాపు 12 గంటలకు పైగా గృహనిర్బంధంలో ఉన్న మోడల్ ఎట్టకేలకు వివాహానికి అంగీకరించారు. దీంతో కథ సుఖాంతమైంది. అయితే ఆమెను అపార్ట్మెంట్లో కొన్ని గంటలపాటు బంధించడంతో పాటు నాటు తుపాకీని కలిగి ఉన్నాడన్న కారణాలతో పోలీసులు ఆ మోడల్ ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో తెలియాల్సి ఉంది. అసలేమైందంటే.. భోపాల్‌కు చెందిన 30 ఏళ్ల మోడల్, ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్ గత కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. ముంబైలో రోహిత్ సైతం మోడలింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రేమ విషయం తెలుసుకున్న మోడల్ తల్లిదండ్రులు రోహిత్‌తో కూతురి పెళ్లికి నిరాకరించారు. దీంతో చేసేదేంలేక రోహిత్‌తో పెళ్లికి వెనకడుగు వేశారు. ఈ విషయంలో రోహిత్‌పై మోదల్ తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అతడు కొంతకాలం జైలుశిక్ష అనుభవించి బయటకొచ్చాడు. ఈ క్రమంలో మరోసారి తనను పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు భోపాల్‌లోని మిస్రాడ్ ఏరియాలోని మోడల్ అపార్ట్‌మెంట్‌కు శుక్రవారం ఉదయం 6గంటల ప్రాంతంలో వెళ్లాడు రోహిత్. ఐదో అంతస్తులో నివాసం ఉంటున్న మోడల్ ఇంట్లోకి ప్రవేశించి డోర్ లాక్ చేశాడు. చుట్టుపక్కలవారి నుంచి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మోడల్‌ను కాపాడాలని భావించారు. అయితే మోడల్, తాను ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పోలీసులకు వీడియో కాల్ ద్వారా తెలిపారు రోహిత్. ఈ క్రమంలో 12 గంటలు గడిచిపోయాయి. పెళ్లి గురించి మరోసారి ఆరాతీయగా వివాహం చేసుకుంటానని ఆమె చెప్పారు. పెళ్లికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని స్టాంప్ పేపర్ మీద సంతకాలు సేకరించాడు. ఇంట్లో నుంచి బయటకురాగానే రోహిత్‌తో పాటు మోడల్‌ను అదుపులోకి తీసుకుని హాస్పిటల్‌కు తరలించినట్లు ఎస్పీ రాహుల్ లోధా తెలిపారు. ఇద్దరికీ పోలీసుల కౌన్సెలింగ్ మోడల్(30), ఆమె ప్రియుడు రోహిత్(30)కి కౌన్సెలింగ్ నిర్వహించిన అనంతరం పోలీసులు మీడియాతో మాట్లాడుతూ.. వారిద్దరూ మేజర్లనీ ఇష్టం ఉంటే పెళ్లి చేసుకోవచ్చునని సూచించాం. అవసరమైతే చట్టపరంగా వారికి సహకారం అందిస్తామని చెప్పినట్లు వివరించారు. అయితే ఆ సమయంలో నాటు తుపాకీతో ఆమెను ఏమైనా బెదిరించాడా అనే కోణంలోనూ రోహిత్‌పై విచారణ చేపట్టే అవకాశాలున్నాయి. -
పెళ్లి చేసుకోవాలంటూ గృహ నిర్భందం
భోపాల్ : ఓ పైశాచిక ప్రేమికుడు తనను ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను వారి ఇంటిలోనే బంధించాడు. కాపాడాటానికి వచ్చిన పోలీసులను ఒక స్టాంప్ పేపర్, ఫోన్ చార్జర్ కావాలని వింత కోర్కెలు కోరుతున్నాడు. వివరాల ప్రకారం.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రోహిత్ ముంబైలో చిన్నపాటి మోడల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి అదే రంగంలో పనిచేస్తున్న భోపాల్‌కు చెందిన ఒక మోడల్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రోహిత్ ఆ మోడల్ని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. దాంతో రోహిత్ ఆమెని వేధించటం ప్రారంభించాడు. విషయం తెలుసుకున్న మోడల్ తల్లిదండ్రులు రోహిత్ మీద పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో అతన్ని అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలైన రోహిత్ తిరిగి ఆ మోడల్ని వేధించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో మోడల్ ఇంట్లో ప్రవేశించి, తాళం వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువతిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ రోహిత్ దగ్గర మోడల్ బందీగా ఉండటంతో వెంటనే చర్యలు తీసుకోలేకపోతున్నారు. పోలీసులు వచ్చారని తెలుసుకున్న రోహిత్ వీడియో కాల్ ద్వారా తమతో మాట్లాడుతున్నాడని పోలీస్ అధికారులు తెలుపుతున్నారు. వీడియో కాల్ చేసినప్పుడు అతని దగ్గర ఒక తుపాకీ ఉన్నట్లు, యువతి చుట్టూ రక్తం ఉన్నట్లు గమనించామన్నారు. అందుకే ఈ వ్యవహారంలో తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామన్నారు పోలీసులు. అయితే మోడల్ తనను వివాహం చేసుకుంటానని చెప్పిందని అందుకే తాను ఆమె ఇంటికి వచ్చినట్లు రోహిత్ పోలీసులకు తెలిపాడు. యువతితో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా రోహిత్ నిర్భందించాడు. వీరిని ఇంటిలో నిర్భందించి ఇప్పటికే 12 గంటలు దాటింది. ఇంటిలో ఉన్న వారిని క్షేమంగా బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. -
పరిపూర్ణానంద స్వామి గృహనిర్బంధం సరికాదు
తాండూరు: హైదరాబాద్ నుంచి యాదాద్రికి పాదయయాత్ర చేపడుతున్న స్వామి పరిపూర్ణానంద స్వామిని పోలీసులు గృహనిర్బంధం చేయడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యూ.రమేష్‌కుమార్ తెలిపారు. తాండూరులోని అంబేడ్కర్చౌక్లోని ప్రధాన రోడ్డుపై బీజేపీ నాయకులు సోమవారం బైఠాయించారు. రాస్తారోకో చేశారు. వారు ఆందోలనకు దిగిన కొద్దిసేపటికే పోలీసులు చేరుకుని నాయకులను అడ్డుకున్నారు. అనంతరం అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ పరిపూర్ణానంద స్వామిజీ హిందూ ధర్మం కోసం పాటు పడుతున్న వ్యక్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ పూజారి పాండు, పట్టణ అధ్యక్షుడు బంటారం భద్రేశ్వర్, నాయకులు బొప్పి సురేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
పదిహేనేళ్లుగా చీకటి గదిలోనే..
మొయినాబాద్(చేవెళ్ల): అమ్మ.. తమ్ముడు.. మరదలు అందరు ఉన్నా అతడు అనాథ అయ్యాడు. మతి స్థిమితం లేకపోవడంతో వ్యవసాయ పొలం వద్ద బందీ అయ్యాడు. 15 ఏళ్లుగా చీకటిగదిలో బందించి అన్నపానీయాలు కిటికీలోంచి ఇస్తున్నారు. తిండీ ఆ గదిలోనే.. మలమూత్ర విసర్జన ఆ గదిలోనే. మనుషుల్లో మాతవత్వం మాయమవుతుందనడానికి ఈ సంఘటనే తార్కాణం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కనకమామిడి గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కనకమామిడి గ్రామానికి చెందిన బలిజ బుచ్చప్ప, సుశీల దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. అందరి పెళ్లిళ్లు అయ్యాయి. పదిహేనేళ్ల క్రితం తండ్రి బుచ్చప్ప చనిపోయాడు. పెద్దకొడుకు మల్లేష్‌కు మతిస్థిమితం సరిగా లేదని అతని భార్య అప్పట్లోనే వదిలేసి వెళ్లిపోయింది. పెళ్లికి ముందు మల్లేష్ అందరితో కలుపుగోలుగా, చలాకీగా ఉండేవాడు. అన్నదమ్ములు సైతం అన్యోన్యంగా ఉండేవారు. తమ్ముడి పెళ్లి అయ్యాక మల్లేష్‌కు మతిస్థిమితం సరిగాలేదని గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలం వద్ద చీకటి గదిలో బందించారు. అప్పటి నుంచి తల్లి సుశీల ప్లాస్టిక్ కవర్లో అన్నం, నీళ్లు తీసుకెళ్లి కిటికీలోంచి మల్లేష్‌కు ఇచ్చేది. తిండితోపాటు మలమూత్ర విసర్జన కూడా గదిలోనే. 15 సంత్సరాలుగా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. కోట్ల విలువచేసే ఆస్తి ఉన్నా... మల్లేష్ పేరుమీద రూ.కోట్ల విలువచేసే భూమి ఉంది. అయినా తనవాళ్లు అతన్ని సరిగ్గా చూసుకోకుండా గదిలో బందించారు. తల్లి కన్న ప్రేమతో అన్నం, నీళ్లు ఇవ్వడమే తప్ప.. తమ్ముడు, మరదలు మాత్రం అస్సలు పట్టించుకునే పరిస్థితిలేదు. 15 ఏళ్లుగా గదిలోనే బందీగా ఉన్న మల్లేష్ వికృతంగా తయారయ్యాడు. ఇటీవల గ్రామస్తులు గదిలో ఉన్న మల్లేష్‌ను చూసి గడ్డం, తలవెంట్రుకలు తీయించారు. మల్లేష్ చదువుకునే రోజుల్లో చాలా చురుగ్గా ఉండేవాడని చెబుతున్నారు. అతనికి నిజంగానే మతిస్థిమితం సరిగా లేకుంటే ఆసుపత్రిలో చూపించాలి కానీ చీకటి గదిలో బంధించడం ఏమిటని గ్రామస్తులు అంటున్నారు. పౌరహక్కుల కమిషన్ స్పందించి మల్లేష్‌ను చీకటి గదినుంచి విముక్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
గృహ నిర్బంధంలోనే కాపు నేతలు
జిల్లాలో సీఎం పర్యటనకు పోలీసుల ముందు జాగ్రత్త చర్యలు అమలాపురం టౌన్ : కాపుల పాదయాత్ర ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడం... యాత్ర వాయిదా ప్రకటన వెలవడిన తర్వాత కూడా అమలాపురం కాపు నేతలను శనివారం కూడా గృహ నిర్బంధాలకే పరిమతం చేశారు. జిల్లాలో శనివరం ముఖ్యమంత్రి పర్యటన దృష్ట్యా ఎటువంటి హడావుడి సృష్టించకుండా కాపు నేతలను, కార్యకర్తలను గృహ నిర్బంధంలోనే ఉంచారు. వాస్తవానికి పాతయాత్రపై ముద్రగడ శుక్రవారం రాత్రి కిర్లంపూడిలో స్పష్టత ఇచ్చిన క్రమంలో పోలీసులను కాపు నేతల ఇళ్ల నుంచి ఆ రాత్రి నుంచే ఉప సంహరించాల్సి ఉంది. శనివారం సీఎం పర్యటనతో ముందు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, జేఏసీ నాయకుడు నల్లా పవ¯ŒSకుమార్, కోనసీమ తెలగ, బలిజ, కాపు అధ్యక్షుడు కల్వకొలను తాతాజీలను పోలీసులు శనివారం రాత్రి వరకూ కూడా గృహ నిర్బంధంలోనే ఉంచారు. కాగా ఆదివారం ఉదయం నుంచి పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నట్లు తెలిసింది. -
బీసీ సంక్షేమ సంఘం నేతల హౌస్ అరెస్ట్
విజయవాడ: విజయవాడలో బీసీ సంక్షేమ సంఘం నేతలను గురువారం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌కు వ్యతిరేకంగా 13 జిల్లాల్లో కలెక్టరేట్ కార్యాలయాల ముట్టడికి బీసీ సంఘాలు పిలుపునిచ్చాయి. దీనితో ముందస్తుగా గురువారం తెల్లవారు జాము నుంచే బీసీ సంఘం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ నాయకులను అరెస్ట్‌లు చేస్తుండటంతో బీసీ నేతలు మండిపడుతున్నారు.