ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు వ్యవహరశైలి పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు హద్దుమీరి ప్రవర్తిస్తున్న కూడా పట్టించుకుని పోలీసులు.. ప్రతిపక్ష పార్టీ నాయకులు నిరసన కూడా తెలుపకముందే వారిని నిర్భందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరు ఇదే విధంగా కొనసాగుతుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఇలాంటి ఘటనే పునరావృతమైంది. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం జరిగిన ఓ సభలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు
చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్‌సీపీ నాయకుల నిర్భందం
Published Wed, Feb 20 2019 11:20 AM | Last Updated on Fri, Mar 22 2024 11:14 AM
Advertisement
Advertisement
Advertisement