గృహ నిర్బంధంలోనే కాపు నేతలు | kapu leaders house arrested | Sakshi
Sakshi News home page

గృహ నిర్బంధంలోనే కాపు నేతలు

Published Sun, Nov 20 2016 12:11 AM | Last Updated on Mon, Jul 30 2018 6:21 PM

kapu leaders house arrested

  • జిల్లాలో సీఎం పర్యటనకు పోలీసుల ముందు జాగ్రత్త చర్యలు
  • అమలాపురం టౌన్‌ :
    కాపుల పాదయాత్ర ప్రయత్నాలను పోలీసులు అడ్డుకోవడం... యాత్ర వాయిదా ప్రకటన వెలవడిన తర్వాత కూడా అమలాపురం కాపు నేతలను శనివారం కూడా  గృహ నిర్బంధాలకే పరిమతం చేశారు. జిల్లాలో శనివరం ముఖ్యమంత్రి  పర్యటన దృష్ట్యా ఎటువంటి హడావుడి సృష్టించకుండా కాపు నేతలను, కార్యకర్తలను గృహ నిర్బంధంలోనే ఉంచారు. వాస్తవానికి పాతయాత్రపై ముద్రగడ శుక్రవారం రాత్రి కిర్లంపూడిలో స్పష్టత ఇచ్చిన క్రమంలో పోలీసులను కాపు నేతల ఇళ్ల నుంచి ఆ రాత్రి నుంచే ఉప సంహరించాల్సి ఉంది. శనివారం సీఎం పర్యటనతో ముందు జాగ్రత్తగా పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. కాపు రిజర్వేష¯ŒS పోరాట సమితి అధ్యక్షుడు నల్లా విష్ణుమూర్తి, జేఏసీ నాయకుడు నల్లా పవ¯ŒSకుమార్, కోనసీమ తెలగ, బలిజ, కాపు అధ్యక్షుడు కల్వకొలను తాతాజీలను పోలీసులు శనివారం రాత్రి వరకూ కూడా గృహ నిర్బంధంలోనే ఉంచారు. కాగా ఆదివారం ఉదయం నుంచి పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నట్లు తెలిసింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement