
కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి కూటమి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది. చంద్రబాబు, పవన్, అనితల వల్ల కాకపోవడంతో.. ప్రధాని మోదీ దృష్టికి ఈ కేసును తీసుకెళ్లాలని తల్లి పార్వతి, తండ్రి రాజునాయక్ ప్రయత్నిస్తున్నారు. అయితే అందుకు పోలీసులు అడ్డుపడుతున్నారు.
ప్రధాని కర్నూలు పర్యటన వేళ.. పోలీసులు ఆమెను హౌజ్ అరెస్ట్ చేశారు. మోదీని కలిసి తమకు న్యాయం చేయమని కోరాలని సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె బుధవారం కర్నూలు కలక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టారు కూడా.
అయితే మోదీ పర్యటన, సభకు సుగాలి ప్రీతి కుటుంబం అటంకం కలిగించవచ్చనే ఉద్దేశంతో.. భద్రతా కారణాలను చూపిస్తూ హౌజ్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఆమెతో పాటు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులందరినీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ పరిణామంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి: పవన్.. ఏ ముఖం పెట్టుకుని కర్నూలు వస్తున్నావ్?