breaking news
sugali preethi case
-
MLC Kumbha Ravibabu: న్యాయం చేయమని అడిగితే అంత అలుసా..!
-
గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతున్నావా.. నువ్వొక డిప్యూటీ సీఎం గుర్తుందా
-
సుగాలి ప్రీతి తల్లి ఆవేదన.. ఈ పాపం ఎవరిది పవన్?
-
ప్రచారానికి వాడుకుని వదిలేశారు: సుగాలి ప్రీతి తల్లి పార్వతి
నంద్యాల (అర్బన్): హత్యాచారానికి గురైన తన కుమార్తె సుగాలి ప్రీతి అంశాన్ని జనసేనాని పవన్‌కళ్యాణ్ ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకుని ఇప్పుడు గాలికి వదిలేశారని ఆమె తల్లి పార్వతి విమర్శించారు. నంద్యాలలో సోమవారం గిరిజన సంఘాలతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఈ కేసును గాలికి వదిలేశారన్నారు. న్యాయం చేయాలంటూ అమరావతికి వెళితే జన సైనికులు, వీర మహిళలతో అవమానాలకు గురి చేస్తున్నారని.. ఎమ్మెల్యేలు, మంత్రులు వెటకారం మాటలతో ఇబ్బందుల పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.లోకేశ్ రెడ్‌బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఎందుకు చేర్చలేదో సమాధానం చెప్పాలన్నారు. గవర్నర్‌ను కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తానన్నారు. ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుడు వడిత్య శంకర్‌నాయక్ మాట్లాడుతూ.. మాట ఇచ్చి మోసం చేయడం పవన్‌కళ్యాణ్‌కు అటవాటుగా మారిందని, ప్రీతి తల్లి పార్వతి వీల్‌చైర్ యాత్రకు అన్ని గిరిజన ప్రజా సంఘాలు, సమాఖ్యల సంపూర్ణ మద్దతు కూడగడతామన్నారు. కార్యక్రమంలో జీపీఎస్ అధ్యక్షుడు రాజునాయక్, ఉపాధ్యక్షుడు రాంబాలాజీనాయక్, మాలమహానాడు అధ్యక్షుడు సాంబశివుడు, బిలావత్ శంకర్‌నాయక్, విక్రం సింహనాయక్ పాల్గొన్నారు. -
నాటి ప్రగల్భాలు ఏమయ్యాయి పవన్!
కర్నూలు(టౌన్): సుగాలి ప్రీతి హత్యాచారం కేసుపై గత ఎన్నికలకు ముందు ఊగిపోతూ అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలికిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడరేమని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ప్రశ్నించారు. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలులోని వాసవీ గార్డెన్స్‌లో ఉన్న సుగాలీ ప్రీతి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. ఈ సందర్భంగా తీవ్ర భావోద్వేగానికి గురైన ప్రీతి తల్లి కన్నీటిపర్యంతమయ్యారు.అనంతరం వరుదు కళ్యాణి మాట్లాడుతూ 2017 ఆగస్టులో ప్రీతి హత్యాచారం జరిగితే ఆ తర్వాత రెండేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏంచేశారని ప్రశి్నంచారు. ఎన్నికల్లో డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఈ కేసును రాజకీయంగా వాడుకున్నారని, అధికారంలోకి వస్తే దోషుల తాట తీస్తామని, వదిలి పెట్టే ప్రసక్తి లేదని ఊగిపోతూ ప్రగల్భాలు పలికిన పవన్ ఇప్పుడు సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులకు అపాయింట్మెంటు కూడా ఇవ్వకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ లా అండ్ ఆర్డర్ తన చేతిలో లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు సర్కారు విఫలం ‘‘రాష్ట్రంలో రోజూ 70 నుంచి 80 మంది మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. చంద్రబాబు సర్కారు మహిళల రక్షణలో విఫలమైంది. హోంమంత్రిగా మహిళ ఉన్నా.. అబలలకు రక్షణ లేదు. అసలు హోంమంత్రి అనిత పనిచేస్తున్నారా? టీడీపీ, జనసేన నేతలు, ఎమ్మెల్యేలే మహిళలను లైంగికంగా వేధిస్తున్నా చర్యలు లేవు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేయాలని, కేసును సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రీతి తల్లి వీల్‌చైర్ యాత్రకు అనుమతి కోరితే ఈ ప్రభుత్వం ఎందుకివ్వడం లేదు? రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసిన లోకేశ్.. సుగాలి ప్రీతి కేసుపై ఎందుకు స్పందించడం లేదు.?’’ అని కళ్యాణి ప్రశ్నించారు. జగనన్న వల్లే బాధిత కుటుంబానికి న్యాయం ‘‘2019లో జగనన్న సీఎం అయిన తరువాత సుగాలి ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలిచారు. బాధిత కుటుంబానికి ఐదు ఎకరాల పొలం, ఐదు సెంట్ల స్థలం, ఇంట్లో ఒకరికి ఉద్యో గం, రూ.8 లక్షల నగదు అందజేశారు. కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి సర్కారు ప్రీతి కేసులో న్యాయం చేయాలి. ప్రీతి కుటుంబానికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది.’’ అని కళ్యాణి చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు విజయ మనోహారి, గాజుల శ్వేతారెడ్డి, కల్లా నాగవేణి రెడ్డి, మంగమ్మ, భారతి పాల్గొన్నారు. -
జత్వానీ కేసులో ఉన్న శ్రద్ధ సుగాలి ప్రీతి కేసుపై ఉండదా?: వరుదు కల్యాణి
సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారని, పైగా మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి విమర్శించారు. సాక్షి, కర్నూలు: సుగాలి ప్రీతి కేసులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చట్టపరమైన న్యాయం జరిగిందని.. కానీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారంలో ఉండికూడా ఏం చేయలేకపోతున్నారని.. మొదటి నుంచి ఈ కేసును తన రాజకీయం కోసమే వాడుకుంటున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి విమర్శించారు. సోమవారం కర్నూలులో ఆమె మాట్లాడుతూ.. ‘‘2017 ఆగస్టు 19వ తేదీన గిరిజన బాలిక సుగాలి ప్రీతిపై అత్యాచారం, హత్య జరిగాయి. చంద్రబాబు హయాంలోనే ఈ ఘటన జరిగింది. న్యాయం జరగలేదు సరికదా.. పరిహారం కూడా అందలేదు. అప్పటి నుంచి తల్లిదండ్రులు న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు. కానీ, వైఎస్ జగన్ హయాంలో చట్టపరమైన న్యాయం చేశారు... 2024 ఎన్నికల ముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అధికారంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో సుగాలి ప్రీతిని పట్టించుకోలేదు. రుషికొండ భవనాలు చూడానికి వెళ్ళిన డిప్యూటీ సీఎం పవన్‌కి.. సుగాలి ప్రీతి కేసు కనిపించ లేదా?. ముంబై నటి కాదంబరీ జత్వానీ కేసు మీద పెట్టిన శ్రద్ద.. ఈ గిరిజన బాలిక గురించి పట్టదా?. న్యాయం కోసం నిలదీస్తే.. నా చేతిలో ఏం లేదని పవన్ చెప్పడం అసలు ఏంటి?. న్యాయ పోరాటం చేస్తున్న కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు?. చంద్రబాబు అరెస్టై జైలుకు వెళ్లాక.. రాజ్యాంగం పట్టుకుని లోకేష్ న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మరి ఆయనకు ఈ కేసు కనిపించడం లేదా?. నారా లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి నిందితుల పేర్లు లేవా? మహిళలకు రక్షణ కల్పిస్తామని చెప్పి చంద్రబాబు.. ఎప్పుడు ఎక్కడ ఉన్నారు?. ఈ కేసును కేవలం రాజకీయంగా కూటమి ప్రభుత్వం, పవన్ కల్యాణ్ వాడుకున్నారు. పవన్ మాటలకు చేతలకు స్పష్టంగా తేడా కనిపిస్తోంది. న్యాయం సంగతి పక్కనపెడితే.. జనసేన ఎమ్మెల్యేలు తిరిగి ఆమె కుటుంబం పైనే ఎదురుదాడికి పాల్పడుతున్నారు. కూటమి ప్రభుత్వం ఈ కేసు విషయంలో నిర్లక్ష్యం విడనాడి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్, అవసరమైతే సీబీఐతో విచారణ జరిపించాలి. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తోంది అని వరుదు కళ్యాణి అన్నారు.ఇదీ చదవండి: వామ్మో.. చింతమనేని! -
సుగాలి ప్రీతి కుటుంబాన్ని పరామర్శించిన వరుదు కల్యాణి
-
సుగాలి ప్రీతి కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ మోసం చేశారు
-
టీడీపీ అంతర్జాతీయ పార్టీ, జనసేన జాతీయ పార్టీ: పేర్ని నాని సెటైర్లు
సాక్షి, తాడేపల్లి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్‌పై మాజీ మంత్రి పేర్ని నాని సెటైరికల్ కామెంట్స్ చేశారు. టీడీపీ అంతర్జాతీయ పార్టీ, జనసేన జాతీయ పార్టీ అని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఎన్నిక్లలో సుగాలి ప్రీతి పేరును పవన్ రాజకీయంగా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేస్తే అది కూడా పవన్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు అంటూ ఘాటు విమర్శలు చేశారు.మాజీ మంత్రి పేర్ని నాని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..‘జనసేనకు ఐడియాలజీ అనేది ఉందా?. జనసేన ఐడియాలజీ అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిమా!. జనసేన సిద్ధాంతం అర్థం కాక ఆ పార్టీ నేతలే సతమతమవుతున్నారు. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ న్యాయం చేశారు. పవన్ ఎన్నిక్లలో సుగాలి ప్రీతి పేరును రాజకీయంగా వాడుకున్నారు. చంద్రబాబు హయాంలోనే సుగాలి ప్రీతి నిందితులకు బెయిల్ వచ్చింది. సుగాలి ప్రీతి కుటుంబానికి వైఎస్ జగన్ సాయం చేశారు.ప్రీతి తల్లిదండ్రులకు వైఎస్ జగన్ భూమి, ఇల్లు, ఉద్యోగాలు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి పవన్ కేకలు వేస్తూ మాట్లాడారు. ప్రీతి కేసును సీబీఐని అప్పగించాలని పవన్ ఎందుకు ఒత్తిడి చేయడం లేదు. గత చంద్రబాబు ప్రభుత్వంలోనే నిందితులు అరెస్ట్ అయ్యి బెయిల్‌పై బయటకు వచ్చారు. సుగాలి ప్రీతి కుటుంబానికి పవన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. పవన్ తీరుతో ప్రీతి కుటుంబం మానసికంగా కుంగిపోయింది. నిందితులకు డీఎన్ఏ మ్యాచ్ కాకపోవడంతో చంద్రబాబు హయంలోనే నిందితులకు బెయిల్ వచ్చింది. సుగాలిప్రీతి హత్య విషయంలో పవన్ ప్రశ్నించాల్సింది చంద్రబాబును.. కానీ, ఆయనను ప్రశ్నించే ధైర్యం పవన్‌కు లేదు’ అంటూ విమర్శలు చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై పవన్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. త్వరలో మరో రెండు వేల మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నారు. కూటమి వేధింపులు తాళలేక 1440 మంది ఉద్యోగులు వెళ్లిపోయారు. వీఆర్ఎస్ తీసుకోవడానికి మరో 1000 మంది ఉద్యోగులు రెడీ ఉన్నారు’ అని తెలిపారు. -
సుగాలి ప్రీతి కేసుపై పవన్ వ్యాఖ్యలకు అంబటి అదిరిపోయే కౌంటర్
-
కుట్ర అడ్డం తిరిగింది.. అడ్డంగా ఇరుక్కున్న బాబు.. పవన్
-
Exclusive Interview: పవన్ చేసిందేమీ లేదు.. అంతా జగనే చేసాడు.. దిమ్మతిరిగే కౌంటర్
-
సుగాలి ప్రీతి తల్లిపై ఎదురుదాడి.. బయటపడ్డ పవన్ నిజస్వరూపం
-
మాపై పవన్ ఆరోపణలు సరికాదు: సుగాలి ప్రీతి తల్లి
సాక్షి, కర్నూలు: తమపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు బాధను కలిగిస్తున్నాయని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో అప్పటి టీడీపీ ప్రభుత్వం తమకు న్యాయం చేయలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో తమకు పరిహారం అందించారన్నారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసు మూడు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టి 14 నెలలు అవుతున్న తమకు న్యాయం చేయలేదని పార్వతి అన్నారు.‘‘తమకు న్యాయం చేయక పోగా పవన్.. తమపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. పవన్ రెండు ఉద్యోగాలు ఇప్పించారని దుష్ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగనే మాకు ఉద్యోగం ఇప్పించారు. డీఎన్ఏ రిపోర్టులు మార్చారని.. పవన్ ఏ ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. న్యాయం చేయమని అడిగితే మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేస్తాం. నిందితులను శిక్షించేవరకు పోరాడతా’’ అని సుగాలి ప్రీతి తల్లి పార్వతి స్పష్టం చేశారు. -
సుగాలి ప్రీతి కేసు లేదు.. స్టీల్ ప్లాంట్ ఊసులేదు
రాష్ట్రానికి దాదాపు ముప్పైమంది ఎంపీలున్నారు.. మీరంతా ఎందుకున్నట్లు?.. సిగ్గుందా? లజ్జ ఉందా?? మీకసలు పౌరుషం లేదా??? పౌరుషం కావాలంటే కాసింత గొడ్డుకారం తినండి! ఒంటికి రాసుకోండి!!.. అప్పుడైనా మీకు పౌరుషం వస్తుందేమో..!!! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ చేస్తుంటే ఈ వైఎస్సార్సీపీ వాళ్లెం చేస్తున్నారు? ఇదేనా మీ నైతికత.. ఇదేనా మీ బాధ్యత .. అదే నేను ఉండుంటే ఢిల్లీవాళ్ళు ఇలాగె చెలరేగిపోయేవాల్లా.. ఖచ్చితంగా నేను ఆ ప్రయివేటీకరణంను ఆపేసేవాణ్ని.. ఎన్నికలకు ముందు చిందులు తొక్కిన పవన్.. నేడు ఆ అంశాన్ని మెల్లగా సైడ్ చేసేసారు. విశాఖలో మూడురోజులపాటు పార్టీ నేతలు.. కార్యకర్తలతో సమావేశాలు అంటూ హడావుడి చేసిన పవన్ తనలోని అసలైన రాజకీయ నాయకున్ని బయటకు తీశారు. ఎప్పట్లానే పదిహేనేళ్ళు మళ్ళా తెలుగుదేశంతో కలిసి సాగుతానని అన్నారు. దానికి కార్యకర్తలు.. నాయకులు తలూపాలని చెప్పేశారు.పదవులు ముఖ్యం కాదని.. సమాజమే ప్రధానమని... దేశోద్ధారణకు పార్టీ ఏర్పాటు చేసానని చెప్పేసారు. తనకు తన అన్న నాగబాబుకు పదవులు వచ్చాయి కాబట్టి అలాగే అంటాడు. కానీ గ్రామ.. మండల స్థాయిల్లో పని చేస్తున్న కార్యకర్తలు.. నాయకుల పరిస్థితి ఏమిటని ? తమను తెలుగుదేశం వాళ్ళు సెకెండ్ గ్రేడ్ పౌరుల్లా చూస్తున్నారని లోలోన జనసైనికులు కుమిలిపోతున్నా ఆ సౌండ్ బయటకు రాకుండా చేతులు అడ్డం పెట్టుకున్నారు. మరోవైపు ఉత్తరాంధ్ర ఎమోషన్ అయినా విశాఖ స్టీల్ ప్లాంట్ లోని కీలక విభాగాలను ప్రయివేటుకు అప్పగిస్తూ ఇటీవల కేంద్రం వేసిన నోటిఫికేషన్ గురించి పవన్ ఎక్కడా కిక్కురుమనలేదు. అసలు ఆ విషయాన్నీ కూడా జనంలోకి రాకుండా కవర్ చేయడానికి తాపత్రయపడ్డారు. మరోవైపు సుగాలీ ప్రీతి హత్య గురించి ఎన్నికలకు ముందు గంగవెర్రులెత్తిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా పట్టించుకోవడం మానేశారని, ఆమె తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ పవన్ తమకు న్యాయం చేయకపోతే జనసేన ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే మొదట ఓపెన్ చేసేది సుగాలి ప్రీతి కేసు అని... అప్పట్లో చెప్పిన పవన్ ఇప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా వదిలేసి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మాట్లాడుతున్నారు. స్టీల్ ప్లాంట్ మీద కూడా ఎక్కడా ప్రస్తావించకుండా వైయస్ జగన్ ప్రభుత్వం నిర్మించిన రుషికొండ భవనాలు చూడ్డానికి వెళ్లారు. అందులో సీలింగ్‌కు వేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కొన్నిచోట్ల ఊడిందని చెబుతూ రాద్ధాంతం చేస్తున్నారు. అటు వేలకోట్ల విలువైన ఉక్కుపరిశ్రమ గురించి మాట్లాడకుండా ఇలాంటి చిల్లర విషయాలు ప్రస్తావిస్తూ ప్రజల ఆలోచనలను డైవర్ట్ చేస్తూ ఇలా పూటగడిపేస్తున్నారని విశాఖలోని యువత దుమ్మెత్తిపోస్తున్నారు. మొత్తానికి మూడురోజుల పవన్ ప్రోగ్రాం సొంత డబ్బా కొట్టుకోవడానికి .. చంద్రబాబును కాపాడ్డానికి ఉపయోగపడిందని అంటున్నారు..:::సిమ్మాదిరప్పన్న -
సుగాలి ప్రీతి మరణాన్ని పవన్ రాజకీయం చేసి డిప్యూటీ CM అయ్యారు: శ్రావణ్
-
‘సుగాలి ప్రీతి కుటుంబానికి సాయం.. పవన్ క్రెడిట్ ఏమీ లేదు’
సాక్షి,తాడేపల్లి: సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది. ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?’అని వైఎస్సార్సీపీ నేత పోతిన వెంకట మహేష్ ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా నిలిచారు. ఆ క్రెడిట్ తనదేనంటూ పవన్ సోషల్ మీడియాలో చేసుకుంటున్న ప్రచారంపై పోతిన మహేష్ ధ్వజమెత్తారు. శుక్రవారం తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.సుగాలి ప్రీతి గురించి పవన్ కళ్యాణ్ మాట మార్చారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట, లేనప్పుడు ఒకమాట మాట్లాడటం ఆయనకే చెల్లింది. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేసిందే జగన్. పవన్ వైజాగ్ వెళ్లి పెట్టిన మీటింగ్ వలన ప్రజలకు ఏమైనా మేలు జరిగిందా?.రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక, మద్యం దోపిడీ గురించి పవన్ ఎందుకు మాట్లాడలేదు?.సొంత పార్టీ ఎమ్మెల్యేలతో కూడా పవన్ కళ్యాణ్ ముఖాముఖి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ నేతలే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దీని గురించి జనసేన ఎమ్మెల్యేలు అడుగుతారనే పవన్ కళ్యాణ్ వారికి అవకాశం ఇవ్వలేదు. టీడీపీ నేతల జోక్యం గురించి మాట్లాడితే చంద్రబాబుకు కోపం వస్తుందని సొంత ఎమ్మెల్యేలకే అవకాశం ఇవ్వలేదు.సుగాలి ప్రీతి హత్య గత చంద్రబాబు పాలనలోనే జరిగింది.ఆమె కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి పవన్ అనేకసార్లు చెప్పారు. మరి అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోవటం లేదు?. వైఎస్ జగన్ మాత్రమే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేశారు. పొలం, నగదు, ఉద్యోగం ఇచ్చింది జగనే. కానీ ఆ క్రెడిట్ ని కూడా పవన్ నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకుంటున్నారు. అసలు ఆ కేసును త్వరగా ఎందుకు తేల్చటం లేదో పవనే సమాధానం చెప్పాలి?.విచారణ జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారు?.చంద్రబాబు హయాంలో డీఎన్ఏలు మార్చి ఉంటారు.దానిపై పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు?పవన్ కళ్యాణ్ చంద్రబాబు చొక్కా పట్టుకుని ఎందుకు నిలదీయలేదు?.సోషల్ మీడియా ని అడ్డం పెట్టుకుని సుగాలి ప్రీతి అంశం మీద దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు అదే సోషల్ మీడియాని నియంత్రించాలని చట్టం తెస్తారట. హోంమంత్రి పదవిని తీసుకుంటానన్న పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసును విచారించాలి.వచ్చే 15ఏళ్లు చంద్రబాబు పల్లకి మోయాలని పవన్ అంటున్నారు. జనసైనికులు దీనిపై ఆలోచించుకోవాలి. జనసేన సైనికులందరినీ పవన్ కళ్యాణ్ టీడీపీకి అమ్మేశారు.రుషికొండ భవనాలు ప్రభుత్వానివేనని పవన్ అంగీకరించారు. అమరావతిలో భూములు లాక్కోవటం వలనే పర్యావరణం దెబ్బ తిన్నదని పవన్ నర్మగర్భంగా చంద్రబాబును అన్నారు. ప్రకృతిని నాశనం చేస్తున్నారని చంద్రబాబును ఉద్దేశించే అన్నారని’ పోతిన మహేష్ స్పష్టం చేశారు. -
Parvati: మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్ పైనే అని చెప్పిన పవన్
-
పవన్ కళ్యాణ్ ఒక నమ్మక ద్రోహి.. సుగాలి ప్రీతీ తల్లి కన్నీరు
-
పవన్‌పై సుగాలి ప్రీతి తల్లి ఆగ్రహం
సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా?. అలాగే, లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా? అని అడిగారు. పవన్.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు.. అధికారం వచ్చాక ఎందుకు గుర్తు రావడం లేదని సూటిగా ప్రశ్నించారు.సుగాలి ప్రీతికి నమ్మకం ద్రోహం పేరుతో విజయవాడలో సుగాలి పార్వతి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సుగాలి పార్వతి మాట్లాడుతూ.. నా కూతుర్ని అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేశారు. ఎనిమిది సంవత్సరాలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నాను. న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయినా తరువాత ఈ కేసును పవన్ కల్యాణ్ గాలికి వదిలేశారు. మొదటి సంతకం సుగాలి ప్రీతి ఫైల్‌పైనే అని అన్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయినా ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అసెంబ్లీ సమావేశాల్లో నా కూతురు కేసుపై చర్చించాలి. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి సీబీఐ విచారణ జరిపించాలి. సేనతో సేనాని అంటున్నారు.. నా కూతురుకి మాత్రం న్యాయం చేయలేకపోయారు. రాష్ట్ర హోంశాఖ మంత్రి అనితకు శ్రీకాంత్ పెరవలిపై ఉన్న దృష్టి నా కూతురు విషయంలో లేదు. ఎమ్మెల్సీ అనంత విషయంలో ఉన్న ఆత్రుత నా కూతురు విషయంలో లేదు. గిరిజనులు అంటే ఓటుకు మాత్రమే పనికొస్తారా?. ఎందుకు ఇప్పటి వరకు న్యాయం చేయలేకపోయారని మంత్రి అనితను అడుగుతున్నాను.గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకొని నాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తాను. సుగాలి ప్రీతికి జరిగిన అన్యాయంపై డిజిటల్ క్యాంపైయిన్ చేస్తాం. నిరాహార దీక్షకి కూడా పూనుకుంటాం. ఎనిమిది సంవత్సరాలు అవిటి తనంతో పోరాటం చేస్తుంటే ప్రభుత్వం స్పందించదా?. లోకేష్ రెడ్ బుక్‌లో సుగాలి ప్రీతి హంతకుల పేర్లు ఉన్నాయా?. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గుర్తున్న పేరు.. అధికారంలోకి వచ్చాక ఎందుకు గుర్తులేదు?. జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపడతాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
సుగాలి ప్రీతి తల్లి వీల్‌చైర్ యాత్ర అడ్డుకోవటం తగదు: శైలజానాథ్
-
జత్వాని కేసుకున్న విలువ మాకు లేదా.. అప్పుడు ఊగిపోయావ్.. ఇప్పుడు ఏమైపోయావ్ పవన్
-
Big Question: సుగాలి ప్రీతికి న్యాయం చేయరు.. రాసలీలల ఖైదీకి పెరోల్ ఇస్తారా
-
నా బిడ్డ కేసును పవన్ కల్యాణ్ గాలికొదిలేశారు: సుగాలి పార్వతి
సాక్షి, కర్నూలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పరిష్కరించే మొదటి కేసు సుగాలి ప్రీతిదే.. జనసేన అధినేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గతంలో చెప్పినమాట. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఆయన ఈ కేసు ఊసెత్తలేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ప్రీతి తల్లి పార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుగాలి ప్రీతి కేసును గాలికి వదిలేశారు. డిప్యూటి సీఎం పవన్ కల్యాణ్, హోం మినిష్టర్ అనితను కలిసిన తమకు న్యాయం జరగలేదు. అందుకే తాను న్యాయం కోసం వీల్ చైర్ యాత్ర ను ప్రారంభించాను. కానీ, యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. అందుకే హైకోర్టును ఆశ్రయించా. ఈనెల 22వ తేదీన కోర్టు ఆదేశాలు జారీ చేయవచ్చు. ఆ వెంటనే యాత్ర మొదలుపెడతా అని అన్నారామె. అదే సమయంలో.. నిందితులకు అధికార పార్టీ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్య , అత్యాచారం చేసిన ఆధారాలు స్పష్టంగా ఉన్న ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారామె.ఇదిలా ఉంటే.. సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోరుతూ ఆమె తల్లి పార్వతి కర్నూల్ నుంచి విజయవాడకు వీల్‌చైర్ యాత్ర ప్రారంభించాలనుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర కావొస్తున్నా కేసు ముందుకు కదలడం లేదని.. న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేకనే తాను న్యాయపోరాటానికి సిద్ధమయ్యాయని చెబుతున్నారామె. అయితే.. ఈ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. వీల్ చైర్ యాత్రకు అనుమతి లేదని అంటున్నారు. యాత్రను చేపట్టవద్దంటూ కర్నూలు పోలీసులు బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో పార్వతి హైకోర్టును ఇవాళ ఆశ్రయించారు.‘‘నా కూతురు అత్యాచారం,హత్యకు గురై 8 సంవత్సరాలు అవుతోంది. ఇప్పటికీ మాకు న్యాయం జరుగలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిష్కరించే మొదటి కేసు సుగాలి ప్రీతిదే అని హామి ఇచ్చారు. కాని కేసు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉండి పోయింది. తానే న్యాయపోరాటం చేస్తానని హామీ ఇచ్చిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు పట్టించుకోవడం లేదు. అందుకే న్యాయం కోసం పోరాటానికి దిగుతున్నా. అడ్డుకోవడం ఎవరి వల్ల కాదు’’ అని అంటున్నారామె.కేసు నేపథ్యం..కర్నూలు నగర శివార్లలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతీబాయ్ 2017 ఆగస్టు 19న అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఫ్యాన్‌కి ఉరేసుకుని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులకు చెప్పింది. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ యజమాని కొడుకులు లైంగిక దాడి చేసి చంపేశారని తల్లిదండ్రులు సుగాలి రాజు నాయక్, పార్వతిదేవి ఆరోపించారు.బాబు హయాంలో ముందుకు సాగని కేసుఅయితే ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ‘జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి’ పేరుతో సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే జరిగింది. అదే రోజు కర్నూలు పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పోక్సో చట్ట నిబంధనల కింద కూడా కేసు పెట్టినా, అప్పటి ప్రభుత్వ పెద్దల తీరుతో తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపారు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ స్కూలు కరస్పాండెంట్, ఆయన కుమారులను అరెస్ట్ చేశారు. తరువాత కొద్ది రోజులకే వారు బెయిల్‌పై బయటకు వచ్చేశారు. చంద్రబాబు హయాంలో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు.అయితే.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని తల్లిదండ్రులు కోరగా, ఆమేరకు ఆయన ఉత్తర్వులిచ్చారు. అంతేకాక 2021లో ప్రీతి తల్లిదండ్రులకు రూ. 8 లక్షల నగదు, 5 సెంట్ల ఇంటి స్థలం, ఐదెకరాల పొలాన్ని అందించారు. ప్రీతి తండ్రి రాజు నాయక్‌కు ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇచ్చారు. అయితే ప్రభుత్వం కోరుతున్నా.. సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ రఘురామ రాజన్ ఈ ఏడాది ఫిబ్రవరి 13న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రీతి మృతి కేసులో అంతర్రాష్ట్ర పర్యవసానాలు, తాము జోక్యం చేసుకోవాల్సినంత చట్టపరమైన సంక్లిష్టత లేవని అందులో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని సీబీఐ ప్రధాన కార్యాలయానికి కూడా తెలిపామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టు, హైకోర్టుల ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన, సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఈ కేసులో అంత సంక్లిష్టత లేదని హైకోర్టుకు తెలిపింది. వనరుల కొరత కారణంగా చూపుతూ తాము దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది. ప్రీతి తల్లిదండ్రుల పిటిషన్‌ను కొట్టేయాలని హైకోర్టును కోరింది. అలా గత బాబు హయాంలో నత్తనడకన సాగిన కేసు.. ఇప్పుడు మళ్లీ ఆయన ప్రభుత్వం రావడంతో పూర్తిగా యూటర్న్ తీసుకుంది. మరోవైపు.. ప్రీతి మృతి కేసును అప్పట్లో రాజకీయంగా వాడుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారే అనే విమర్శలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.