
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బీటెక్ విద్యార్థులు కారు డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరికి గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. బీటెక్ విద్యార్థి సాకేత్ రెడ్డి తన మిత్రుడితో కలిసి మంగళవారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు. అనంతరం, కారు డ్రైవ్ చేస్తూ జాబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీభత్సం సృష్టించారు. వారిద్దరూ మద్యం మత్తులో ఉండటంతో కారు కృష్ణానగర్‌వైపు వెళ్తుండగా మార్గమధ్యంలో కారు అదుపు తప్పింది. కారు అతివేగంతో ఫుట్‌పాత్‌పైకి ఎక్కి.. టెలిఫోన్ స్థంభాన్ని ఢీకొట్టి బోల్తా పడింది.
ఇక, ప్రమాదాన్ని గమినించిన స్థానికులు కారులో ఇరుక్కుపోయిన వారిద్దరినీ బయటకు తీశారు. ఈ ప్రమాదంలో సాకేత్ రెడ్డి, కారులో ఉన్న అతడి స్నేహితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో కారు డ్రైవ్ చేసిన సాకేత్ రెడ్డికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించగా.. మద్యం మోతాదు 146 పాయింట్స్ వచ్చినట్టు పోలీసులు తెలిపారు. మద్యం మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించారు.

Comments
Please login to add a commentAdd a comment