Hyderabad Gangrape Case: AIMIM MLA Son Arrested - Sakshi
Sakshi News home page

రొమేనియా బాలికపై అఘాయిత్యం కేసు.. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే కుమారుడు

Published Wed, Jun 8 2022 4:19 AM | Last Updated on Wed, Jun 8 2022 11:54 AM

MLAs Son Taken Into Police Custody In Jublee Hills Gangrape Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రొమేనియా బాలికపై అఘాయిత్యానికి సంబంధించి పాతబస్తీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడిపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. సామూహిక అత్యాచారంలో అతడి పాత్ర లేకున్నా బెంజ్‌ కారులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించినట్టు గుర్తించారు. ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద సదరు మైనర్‌పై ఆరోపణలు నమోదు చేశారు. ఇతడితో పాటు పరారీలో ఉన్న మరో బాలుడినీ పట్టుకున్నారు. వీరిని బుధవారం జువైనల్‌ హోమ్‌కు తరలించనున్నారు. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగుర్నీ అరెస్టు చేసినట్టయ్యింది.  

మార్చి 28న మొదలైన పార్టీ కథ.. 
బెంగళూరులో నివసిస్తున్న ఓ బాలుడు స్కూల్స్‌ ప్రారంభమయ్యే లోపు హైదరాబాద్‌లో పార్టీ ఏర్పాటు చేయాలని భావించాడు. దానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసే బాధ్యతల్ని హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు స్నేహితులకు (మైనర్లు) అప్పగించాడు. అనేక ప్రాంతాలను పరిశీలించిన వీళ్లు ఆమ్నేషియా అండ్‌ ఇన్సోమ్నియా పబ్‌ను ఎంపిక చేసుకున్నారు. ఈ విషయం బెంగళూరు బాలుడికి చెప్పడంతో అతడు తన ఇన్‌స్ట్రాగామ్‌ పేజ్‌లో ఏప్రిల్‌ 19న ‘ఇన్సోమ్నియా కమింగ్‌ సూన్‌’అంటూ పోస్టు చేశాడు. ఇక్కడి వాళ్లు ముగ్గురు మైనర్లు కావడంతో పబ్‌ బుక్‌ చేయడానికి తమ స్నేహితుడైన ఉస్మాన్‌ అలీ ఖాన్‌ను సంప్రదించారు. ఆయన ద్వారా పబ్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ కునాల్‌ను సంప్రదించి బేరసారాల తర్వాత ఒక్కొక్కరికీ ఎంట్రీ రేటును రూ.1,200 నుంచి రూ.900కు తగ్గించేలా చేశారు.  

ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారానే అంతా.. 
తర్వాత బెంగళూరు బాలుడు తన ఇన్‌స్ట్రాగామ్‌ పేజ్‌లో ‘ఇన్సోమ్నియా పార్టీ ఆన్‌ మే 28 ఎట్‌ 1 పీఎం’అంటూ పోస్టు చేశారు. అక్కడే తన ఫోన్‌ నంబర్‌ సైతం ఇవ్వడంతో హైదరాబాద్‌తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన అతడి ఫాలోవర్స్‌ 150 మంది స్పందించి నగదు చెల్లించారు. వీరికి రేటు రూ.1,200 నుంచి రూ.900కు తగ్గిన విషయం చెప్పలేదు. బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన రొమేనియా బాలికకు బెంగళూరు బాలుడు స్నేహితుడు కావడంతో ఆమె కూడా రూ.1,200 చెల్లించి పారీ్టకి రావడానికి బుక్‌ చేసుకుంది. గత నెల 25న హైదరాబాద్‌కు వచి్చన బెంగళూరు బాలుడు పబ్‌కు వెళ్లి చూడటంతో పాటు రూ.లక్ష అడ్వాన్స్‌గా చెల్లించాడు. ఇది నాన్‌ ఆల్కహాలిక్‌ అండ్‌ నాన్‌ స్మోకింగ్‌ పారీ్టగా ప్రచారం చేశారు. రొమేనియా బాలిక గత నెల 28న బెంగళూరు బాలుడితో కలిసి పబ్‌కు వచి్చంది. అక్కడే ఈమెకు మరో బాలికతో పరిచయమైంది. కొద్దిసేపటికి పబ్‌కు వచి్చన సాదుద్దీన్‌ సహా మిగిలిన బాలురు వీరిని గమనించారు.  

పబ్‌లోనే పథకం వేశారు.. 
పబ్‌లో డ్యాన్స్‌ చేస్తున్న సమయంలోనే రొమేనియా బాలికపై అఘాయిత్యానికి ప్లాన్‌ వేశారు. ఆమె వద్దకు వచ్చి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఇది ఇబ్బందికరంగా భావించిన ఆమె, మరో బాలిక బయటకు వచ్చేశారు. వీరి వెనుకాలే సాదుద్దీన్‌ తదితరులు బయటకు వచ్చారు. మరో బాలిక వెళ్లిపోగా... రొమేనియా బాలికను ట్రాప్‌ చేశారు. బెంజ్‌ కారులో బాలిక, ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో ముగ్గురు బాలురు ఎక్కారు. దీని వెనుక ఇన్నోవా కారులో డ్రైవర్‌ జమీల్, సాదుద్దీన్, ముగ్గురు బాలురు అనుసరించారు. బెంజ్‌ కారులో ఉన్న నలుగురూ బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు.

ఈ రెండు వాహనాలు బంజారాహిల్స్‌ రోడ్‌ నం.14లోని కాన్సూ బేకరీ వద్దకు చేరుకున్నాయి. అక్కడ బాలిక ఇన్నోవా కారులోకి మారగా... డ్రైవర్‌తో పాటు మరో బాలుడిని అక్కడే వదిలేశారు. ఓ ఫోన్‌ కాల్‌ కావడంతో ఎమ్మెల్యే కుమారుడూ వెళ్లిపోయాడు. సాదుద్దీన్‌తో పాటు మిగిలిన నలుగురు బాలురు రొమేనియా బాలికను పెద్దమ్మగుడి ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. అక్కడి నిర్మానుష్య ప్రాంతంలో ఆమెపై అత్యాచారం చేశారు. ఈ సందర్భంలో ఆమె మెడపై గాయాలయ్యాయి. అనంతరం బాలికను పబ్‌ వద్ద వదిలేశారు. తర్వాత తండ్రికి ఫోన్‌ చేసిన ఆమె ఆయనతో కలిసి ఇంటికి వెళ్లిపోయింది.  

రెండురోజుల తర్వాత పోలీసులకు ఫిర్యాదు.. 
ఈ ఉదంతం గత నెల 28న జరగ్గా... 31వ తేదీ వరకు బాలిక విషయాన్ని తండ్రికి చెప్పలేదు. ఆ రోజు తనపై నలుగురు అసభ్యంగా ప్రవర్తించారని మాత్రమే చెప్పింది. ఆయన ఈ మేరకు డీసీపీని కలిపి ఫిర్యాదు చేశారు. అసభ్య ప్రవర్తన కేసు నమోదు చేసుకున్న పోలీసులు భరోసా కేంద్రంలో బాలికకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ సమయంలో బాలిక సామూహిక అత్యాచారం విషయాన్ని బయట పెట్టడంతో కేసులో ఆ సెక్షన్లు కూడా చేర్చారు. సాదుద్దీన్‌తో పాటు ముగ్గురు బాలురను పట్టుకుని చర్యలు తీసుకున్నారు. కాగా సోమవారం మేజి్రస్టేట్‌ ముందు వాంగ్మూలం ఇచి్చన బాలిక బెంజ్‌ కారులో ఎమ్మెల్యే కుమారుడు అసభ్యంగా ప్రవర్తించిన విషయాన్ని వెల్లడించింది. దీంతో ఐపీసీలోని 354, 323తో పాటు పోక్సో యాక్ట్‌లోని 9(జీ) రెడ్‌విత్‌ 10 సెక్షన్ల కింద అతడిపై ఆరోపణలు నమోదు చేశారు. ఈ బాలుడితో పాటు అత్యాచారం కేసులో పరారీలో ఉన్న మరో బాలుడినీ మంగళవారం పట్టుకున్నారు.  

హోం మంత్రి మనవడి పాత్ర లేదు: కొత్వాల్‌ 
ఈ కేసుకు సంబంధించి నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ మంగళవారం రాత్రి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీవ్రమైన కేసు కావడంతో క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన నేపథ్యంలో మరో బాలుడిని నిందితుడిగా చేర్చడంలో ఆలస్యమైందని అన్నారు. హోంమంత్రి మనవడి పాత్ర ఏమాత్రం లేదని, ఆ ఆరోపణలు చేసిన వాళ్లు వచ్చి తనకు ఆధారాలు అందిస్తే కచి్చతంగా దర్యాప్తు చేస్తామని స్పçష్టం చేశారు. పబ్‌ నుంచి బేకరీకి వెళ్లే క్రమంలో, ఆ తర్వాత ఈ రెండు కార్లను మైనర్లు నడిపారని తేల్చామన్నారు. ఈ నేపథ్యంలోనే వారికి కార్లు ఇచి్చన తల్లిదండ్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ కేసులో నిందితుడు (సాదుద్దీన్‌), చట్టంతో విభేదించిన బాలురు స్నేహితులే అయినప్పటికీ వారి మధ్య విభేదాలు, ఆధిపత్య పోరు ఉందన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైనప్పుడు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టవచ్చనే ఉద్దేశంతోనే బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న సమయంలో వీడియోలు తీసుకున్నారని, వాటిని వారే సర్క్యులేట్‌ చేసుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే కేసులో ఐటీ యాక్ట్‌ను చేర్చామని తెలిపారు. ఈ కేసు విచారణ పోక్సో చట్ట ప్రత్యేక కోర్టులో జరుగుతుందని పేర్కొన్నారు. ‘కారులో బాలిక’వీడియోలు ఎమ్మెల్యేకు ఎలా వచ్చాయో అబిడ్స్‌ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసు దర్యాప్తు నేపథ్యంలో అడుగుతామని వివరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement