సాక్షి,హైదరాబాద్ : సహాయం కోసం తన వద్దకు వచ్చిన యువతిపై ఓ వృద్ధుడు అత్యాచారం చేశాడు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం..బాధిత యువతి (24) భర్తతో విడాకులు తీసుకొని ఫలక్‌నుమాలో ఉంటోంది. అలీబకర్ అనే వ్యక్తితో కొద్ది రోజులుగా సహజీవనం చేస్తోంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఇద్దరూ తమకు ఆర్థిక సాయం చేయాలని బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలో ఉండే అలీబకర్ పెద్దమ్మ భర్త సలీముద్దీన్(80) వద్దకు ఏప్రిల్ 3న వెళ్లారు. ముగ్గురూ కలిసి మద్యం తాగారు. తర్వాత మత్తులోకి జారుకున్న యువతిపై సలీముద్దీన్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను అలీబాకర్ తన ఫోన్‌తో రహస్యంగా వీడియో తీశాడు. ఇదిలా ఉండగా..తన ఇంట్లో ఖరీదైన చేతి గడియారం కనిపించడంలేదని అలీ బాకర్‌తో పాటు యువతిపై అనుమానం వ్యక్తం చేస్తూ గత నెల 13న సలీముద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఇద్దరినీ పిలిచి విచారించారు. తనపై సలీముద్దీన్ అత్యాచారానికి పాల్పడ్డాడని, అలీబాకర్ తీసిన వీడియోను శుక్రవారం బాధితురాలు పోలీసులకు అందజేసి ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడు సలీముద్దీన్‌పై ఐపీసీ 376, 506 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment