అన్నమయ్యకు పట్టాభిషేకం | annamayya film got award | Sakshi
Sakshi News home page

అన్నమయ్యకు పట్టాభిషేకం

Published Sat, Jul 23 2016 10:09 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రాఘవేంద్రరావు, కీరవాణి, సునీత...

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రాఘవేంద్రరావు, కీరవాణి, సునీత...

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌లో శ్రీ వేంకటేశ్వర భక్తి చానెల్‌ ఏర్పాటు చేసిన ‘అన్నమయ్య పాటకు పట్టాభిషేకం’ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణానికి వేదికైంది. పది మంది సంగీత దర్శకులు అన్నమయ్య సంకీర్తనలను సీడీల రూపంలో తీసుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా వేసిన సెట్‌లో నిర్వహించారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు కీరవాణి, గాయని సునీత పాల్గొన్నారు. అన్నమయ్య పాటలు హృద్యంగా ఆలపించిన చిన్నారులను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభినందించారు. గత ఆరు నెలుగా 300కు పైగా అన్నమయ్య కీర్తనలకు పది మంది సంగీత దర్శకులు బాణీలు కట్టారని నిర్వాహకులు వెల్లడించారు. ఈ సీడీలను బాలసుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement