జుబ్లీహిల్స్‌ నడిరోడ్డు మీద.. పట్టపగలు.. | drunkard teased woman in jubleehills | Sakshi
Sakshi News home page

బ్రేకింగ్‌: జుబ్లీహిల్స్‌ నడిరోడ్డు మీద.. పట్టపగలు..

Published Sat, Jul 22 2017 3:16 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

drunkard teased woman in  jubleehills

హైదరాబాద్‌: నగరంలో సంపన్నప్రాంతం జుబ్లీహిల్స్‌.. అలాంటి జుబ్లీహిల్స్‌లో నడిరోడ్డు మీద శనివారం పట్టపగలు దారుణం జరిగింది. తాగిన మైకంలో ఉన్న మందుబాబులు ఓ యువతి పట్ల దౌర్జన్యానికి ఒడిగట్టారు. ఆమె కారును తమ కారుతో ఢీకొట్టడమే కాకుండా.. ఆమె నుంచి డబ్బులు లాక్కోబోయారు. ఎలాగోలా మందుబాబుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గతంలో ఇదేమాదిరిగా బంజారాహిల్స్‌లో పోకిరీలు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న రోడ్డు నెంబర్‌ 12లో ఓ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద యువతిపట్ల పోకిరీలు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను అనకూడని మాటలు అనడంతోపాటు బైక్‌లు దిగి వెళ్లి ఆ యువతిపై చేయి చేసుకున్నారు. దీంతో వారికి ఏ మాత్రం భయపడకుండా ధైర్యంగా ఆ యువతి ప్రతిఘటించింది.

ఆమెకు మద్దతుగా దారిన పోయేవారు కూడా పోగవడంతో ఆ పోకిరీలు అక్కడి నుంచి పారిపోయారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. దీంతో పోకిరీల దుశ్చర్యలకు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement