నారాయణఖేడ్: కులాల్ని కించపరుస్తూ ఎవరు పుస్తకాలు రాసినా సహించేది లేదని కాకినాడ శ్రీపీఠం మఠాధిపతి స్వామి పరిపూర్ణానంద తెలిపారు. త్వరలో అన్ని కులాలతో సర్వజన సంఘటన ఏర్పాటు చేస్తానన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో బుధవారం రాత్రి రాష్ట్రీయ హిందూ సేన ఆవిర్భావ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ.. మహిషాసురుడి కోసం అమ్మ వారు ఉద్భవించిన తరహాలో కొందరు పాపాత్ముల కోసం తాను బయటకు వస్తానని, తనను అమ్మ వారే పంపారన్నారు.
తన పుట్టుక, కులం, మతం గురించి అడిగిన విషయాలపై పరిపూర్ణానంద ప్రొఫెసర్ కంచ ఐలయ్యపై పరోక్షంగా వ్యంగ్యంగా మాట్లాడారు. ఎక్కడ ఏ మాతృమూర్తి తనను అక్కున చేర్చుకుంటే వారే నా తల్లి అని, ఏ గడపకు వెళ్తే అదే నా ఇల్లు అని, ఏ పురుషుడి రూపం ఎదురైనా నాకు తండ్రి లాంటి వారే అని అన్నారు. సీపీఐ రామకృష్ణ మీ అమ్మ గురించి చెప్పేందుకు ఏం ఇబ్బందని అని పేర్కొన్నాడని, నా రూట్స్ గూర్చి మీలాంటి బ్రూట్స్‌కు, చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment