సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ నగరం నుంచి పోలీసులు తనను బహిష్కరించడాన్ని నిరసిస్తూ శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానంద హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పరిపూర్ణనంద బుధవారం హైకోర్టులో లంచ్ మోషన్ ధాఖలు చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను, రాజ్యాంగ హక్కులను తెలంగాణ పోలీస్ శాఖ విస్మరిస్తోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తక్షణమే బహిష్కరణను తొలగించేలా పోలీస్ శాఖకు అదేశాలు ఇవ్వాలని పరిపూర్ణనంద స్వామి పిటిషన్‌లో కోరారు. అయితే ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించలేదు.
శ్రీరాముడిపై సినీ విమర్శకుడు కత్తి మహేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ధర్మాగ్రహ పాదయాత్ర చేసేందుకు సిద్ధమైన స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు రెండు రోజుల పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. కత్తి మహేశ్‌ను కూడా హైదరాబాద్ నుంచి బహిష్కరించారు. ఆరు నెలల పాటు నగరంలోకి రాకుండా నిషేధం విధించారు.
Comments
Please login to add a commentAdd a comment