కత్తి మహేస్, స్వామి పరిపూర్ణానందల ఫైల్ ఫొటోలు
శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానందను హైదరాబాద్ పోలీసులు ఆరు నెలలు బహిష్కరించడంపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ ట్విటర్ ద్వారా స్పందించారు. స్వామి పరిపూర్ణానందపై నగర బహిష్కరణ విధించడాన్ని ఆయన ఖండించారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కత్తి మహేష్‌పై హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో పలు కేసులు నమోదయ్యాయి. శాంతి భద్రతలకు ఆటంకం ఏర్పాడుతుందనే భావనతో కత్తి మహేష్‌పై హైదరాబాద్ పోలీసులు ఆరు నెలలు నగర బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే.
‘పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఖండిస్తున్నాను. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు. బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం. మనుషుల్ని‘‘తప్పిస్తే’’ సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంద’ని కత్తి మహేష్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం కత్తి మహేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వామి బహిష్కరణకు మద్దతుగా కత్తి మహేష్ మాట్లాడటం ఆసక్తికర పరిణామం.
స్వామి పరిపూర్ణానందపై కూడా హైదరాబాద్ పోలీసులు నేడు బహిష్కరణ విధించారు. ఆయన గతంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. వాటికి సమాధానం చెప్పలేదంటూ స్వామి పరిపూర్ణానందపై కూడా 6 నెలల బహిష్కరణ వేటు వేశారు.
పరిపూర్ణానంద నగర బహిష్కరణను ఖండిస్తున్నాను. బహిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం కాదు.బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.మనుషుల్ని "తప్పిస్తే" సమస్యలు తప్పుతాయి అనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుంది.
— Kathi Mahesh™️ (@kathimahesh) 11 July 2018
Comments
Please login to add a commentAdd a comment