
టీడీపీ జెండా
విశాఖ ,అనకాపల్లి: తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకుడు రొంగలి శ్రీరామ్మూర్తిని బహిష్కరిస్తున్నట్లు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధ నాగజగదీశ్వరరావు తెలిపారు. ఈమేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇటీవల రొంగలి శ్రీరామ్మూర్తి తెలుగుదేశం పార్టీని, పార్టీ ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా అభ్యంతర పదజాలంతో కించపరుస్తున్నారని, దీనిని పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించి రొంగలి శ్రీరామ్మూర్తికి షోకాజు నోటీసు జారీ చేసినట్టు పేర్కొన్నారు.
అయినప్పటికీ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా టీడీపీని, పార్టీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా అభ్యంతరకర పదజాలంలో విమర్శించడాన్ని తీవ్రంగా పరిగణించి పార్టీ అధ్యక్షుల సూచన మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని వివరించారు. దీనిలో భాగంగానే రొంగలి శ్రీరామ్మూర్తిని టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment