rongali Ramu
-
టీడీపీ నుంచి రొంగలి బహిష్కరణ
విశాఖ ,అనకాపల్లి: తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎంపీపీ, సీనియర్ నాయకుడు రొంగలి శ్రీరామ్మూర్తిని బహిష్కరిస్తున్నట్లు పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుద్ధ నాగజగదీశ్వరరావు తెలిపారు. ఈమేరకు ఆయన గురువారం ప్రకటన విడుదల చేశారు. ఇటీవల రొంగలి శ్రీరామ్మూర్తి తెలుగుదేశం పార్టీని, పార్టీ ప్రజాప్రతినిధులను వ్యక్తిగతంగా అభ్యంతర పదజాలంతో కించపరుస్తున్నారని, దీనిని పార్టీ వ్యతిరేక చర్యగా పరిగణించి రొంగలి శ్రీరామ్మూర్తికి షోకాజు నోటీసు జారీ చేసినట్టు పేర్కొన్నారు. అయినప్పటికీ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా టీడీపీని, పార్టీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా అభ్యంతరకర పదజాలంలో విమర్శించడాన్ని తీవ్రంగా పరిగణించి పార్టీ అధ్యక్షుల సూచన మేరకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని వివరించారు. దీనిలో భాగంగానే రొంగలి శ్రీరామ్మూర్తిని టీడీపీ నుంచి బహిష్కరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
చీలిక కలతతో ఆగిన గుండె
పద్మనాభం, న్యూసల్ : తెలుగు తల్లిని రెండుగా చీల్చారన్న వార్త అతని హృదయాన్ని కదిలించింది. రాష్ట్ర విభజన వల్ల మనకు తీరని నష్టం కలుగుతుందన్న ఆవేదనతో గుండె ఆగి మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రొంగలి రాము (55) కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని విభజిస్తామని ప్రకటించటాన్ని మొదటి నుంచి జీర్ణించుకోలేకపోయాడు. సీమాంధ్రలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని స్థానికులకు వివరిస్తూ కలత చెందేవాడు. విభజించడం వల్ల హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడు చిట్టినాయుడు ఇంటికి వచ్చేస్తాడని రాము అంటుండేవాడు. సాయంత్రం పొలానికి వె ళ్లి వచ్చిన రాము తెలంగాణ బిల్లును లోక్సభ ఆమోదించిందని తెలియడంతో అధిక రక్తపోటుకు గురయ్యాడు. చికిత్సకు కుటుంబ సభ్యులు ఆటోలో విజయనగరం తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో గుండె ఆగి మృతి చెందాడు. మృతుడు రాముకు భార్య ముత్యాలమ్మ, కుమార్తె లక్ష్మి, కుమారులు శ్రీనివాసరావు, చిట్టినాయుడు ఉన్నారు.