
చీలిక కలతతో ఆగిన గుండె
పద్మనాభం, న్యూసల్ : తెలుగు తల్లిని రెండుగా చీల్చారన్న వార్త అతని హృదయాన్ని కదిలించింది. రాష్ట్ర విభజన వల్ల మనకు తీరని నష్టం కలుగుతుందన్న ఆవేదనతో గుండె ఆగి మరణించాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పెంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రొంగలి రాము (55) కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రాన్ని విభజిస్తామని ప్రకటించటాన్ని మొదటి నుంచి జీర్ణించుకోలేకపోయాడు.
సీమాంధ్రలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు రావని స్థానికులకు వివరిస్తూ కలత చెందేవాడు. విభజించడం వల్ల హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న తన కుమారుడు చిట్టినాయుడు ఇంటికి వచ్చేస్తాడని రాము అంటుండేవాడు. సాయంత్రం పొలానికి వె ళ్లి వచ్చిన రాము తెలంగాణ బిల్లును లోక్‌సభ ఆమోదించిందని తెలియడంతో అధిక రక్తపోటుకు గురయ్యాడు. చికిత్సకు కుటుంబ సభ్యులు ఆటోలో విజయనగరం తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో గుండె ఆగి మృతి చెందాడు. మృతుడు రాముకు భార్య ముత్యాలమ్మ, కుమార్తె లక్ష్మి, కుమారులు శ్రీనివాసరావు, చిట్టినాయుడు ఉన్నారు.