న్యూఢిల్లీ : పార్లమెంట్‌లో డబ్బుకు ప్రశ్నల వ్యవహారంలో ఎంపీ మహువా మెయిత్రాపై నివేదికను ఎథిక్స్‌కమిటీ ఇవాళ లోక్‌సభ ముందు ప్రవేశపెట్టనుంది. వినోద్‌కుమార్ సోంకర్ నేతృత్వంలోని ఎథిక్స్ కమిటీ మహువా మొయిత్రాను పార్లమెంట్ నుంచి బహిష్కరిస్తూ సిఫారసు చేసిన నివేదికను ఇప్పటికే ఆమోదించింది.
మహువాపై ఎథిక్స్ కమిటీ నివేదికను లోక్‌సభ ముందు ప్రవేశపెట్టేందుకు శుక్రవారం(డిసెంబర్ 8) లిస్ట్ చేశారు. ఎజెండాలో ఐటెమ్ నంబర్ ఏడుగా దీనిని చేర్చారు. నివేదికను సభ ఆమోదిస్తే మహువా తన ఎంపీ పదవిని కోల్పోతారు. ఈ నెల 4వ తేదీనే మహువాపై నివేదికను టేబుల్ చేసేందుకు లిస్ట్ చేసినప్పటికీ దానిని ప్రవేశపెట్టలేదు.
అయితే మహువాపై నివేదికపై సభలో చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టుబడుతున్నాయి. చర్చ లేకుండా చర్యలు తీసుకోవడం సరికాదని సూచిస్తున్నాయి. ఈ నివేదిక మ్యాచ్ ఫిక్సింగ్‌లా కనిపిస్తోందని ఆ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
వ్యాపారవేత్త దర్శన్ హీరానందాని ఆదేశాల మేరకే అదానీ గ్రూపుపై ప్రశ్నలు వేశారని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్‌సభ స్పీకర్‌కు మహువాపై ఫిర్యాదు చేశారు. అనంతరం స్పీకర్ ఈ వ్యవహరాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. ఎథిక్స్ కమిటీ ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి నివేదికను సిద్ధం చేసింది. ఈ విచారణలో భాగంగా ఎథిక్స్ కమిటీ ముందు మహువా హాజరయ్యారు.
ఇదీచదవండి..2024లో ఇస్రో 10 కీలక ప్రయోగాలు
Comments
Please login to add a commentAdd a comment