ప్రతీకాత్మక చిత్రం
సిరికొండలోని గడ్కోల్‌లో చిన్నపిల్లల మధ్య గొడవ కాస్త ఓ కుటుంబం బహిష్కరణకు దారి తీసింది. చిన్నారుల గొడవ కారణంగా ఇద్దరి మహిళల మధ్య వాగ్వాదం జరిగి వారు మొదట సిరికొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేయగా తగాదా కోర్టుకు చేరింది. కోర్టులో ఓ మహిళ కుటుంబానికి న్యాయస్థానం ఫైన్ వేయగా వారు కట్టేశారు.
అయితే కుల సంఘంలోకి సదరు మహిళ కుటుంబం రావాలంటే ఆల్ కమిటీ(వీడీసీ)కి రూ. లక్ష చెల్లించాలని తీర్మానించారు. కోర్టుకు వెళ్లి జరిమానా కట్టామని మళ్లీ మీకు ఎందుకు కట్టాలని వారు ఆల్ కమిటీ(వీడీసీ)ని ప్రశ్నించారు. దీంతో ఈ కుటుంబాన్ని ఇప్పటివరకు కులసంఘానికి సంబంధించిన ఏ కార్యక్రమాలకు పిలవట్లేదు. మాట్లాడట్లేదు. చివరికి ఆల్‌కమిటీ(వీడీసీ) చేసిన నిర్వాకంపై శుక్రవారం బాధిత కుటుంబం ఏసీపీ కిరణ్‌కుమార్‌ను ఆశ్రయించింది.
Comments
Please login to add a commentAdd a comment